Hin

23rd nov 2023 soul sustenance telugu

November 23, 2023

ప్రతిరోజును ఫిర్యాదు లేని రోజుగా చేసుకోండి

ఒక వ్యక్తి లేదా పరిస్థితి గురించి మనం చివరిసారిగా ఎప్పుడు ఫిర్యాదు చేసాము? చాలా కాలమయ్యి ఉండకపోవచ్చు… నిన్ననే కావచ్చు. మన జీవితం చాలా హాయిగా ఉనప్పటికీ మనం పదే పదే ఫిర్యాదు చేస్తూ  ఉంటాము, లోపాలను వెతుకుతూ ప్రతికూలతలను చూపుతూ ఉంటాము. ఈ అలవాటు మనల్ని ఒత్తిడికి గురిచేసి మనల్ని క్షీణింపజేస్తుంది మరియు పరిష్కారాన్ని పొందకుండా నిరోధిస్తుంది. పదే పదే ఫిర్యాదు చేస్తున్నాము అంతే ముందుగా మనలో ఏదో మార్పు రావాలి అని సూచిస్తుంది అంతేకానీ మనకు జరిగేదానిలో  కాదు.

 

ఉద్దేశపూర్వకంగా కాకున్నా మీరు వ్యక్తులు మరియు పరిస్థితుల గురించి ఫిర్యాదు చేస్తారా? అస్తవ్యస్తమైన ట్రాఫిక్, చెడు వాతావరణం, రుచిలేని ఆహారం , కుటుంబీకుల లేదా సహోద్యోగుల పొరపాట్లు  మీరు ఫిర్యాదు చేసే  విధంగా బాధపెడుతున్నాయా?

 

నచ్చినా నచ్చకపోయినా ఫిర్యాదు చేయడం ఒక జీవన విధానంగా మారిపోయింది. ప్రతి సన్నివేశంలో, మనకు 2 ఎంపికలు ఉంటాయి: మొదటిది జీవితాన్ని ఉన్న విధంగా స్వీకరించి సర్దుకుంటూ  ముందుకు సాగిపోవటం, తద్వారా మన శక్తి,  వ్యక్తులు మరియు పరిస్థితులు  సామరస్యంగా

ఉంటాయి. రెండవది పరిస్థితి సరిగా లేనందున ఫిర్యాదు చేయడం.

 

వ్యక్తులు,  పరిస్థితులు మారకపోవచ్చు. మనం ఏదైనా మార్చవలసి వచ్చినప్పటికీ, మన ఆలోచనలలో లేదా మాటలలో ఫిర్యాదు చేయకుండా మారుద్దాం. మన శక్తిని ఫిర్యాదు చేయడంలో వృధా చేయకుండా, సరైనది కాని వాటిని మార్చడానికి  ఉపయోగించుకుందాము.ఫిర్యాదు చేయడం ద్వారా మనమే అసంతృప్తిగా ఉంటాము. ఇది అలవాటుగా మారి  మన జీవితంతో మనం సంతోషంగా ఉండలేము.

 

ఏది ఏమయినప్పటికీ, ఒక రోజంతా ఫిర్యాదు చేయకుండా ఉండండి. బయట విషయాలు అలాగే ఉంటాయి, కానీ మీరు అంతర్గతంగా పాజిటివ్ మార్పును అనుభవం చేసుకుంటారు. ఆపై ప్రతిరోజూ అదే చేయండి. ఈరోజును ఫిర్యాదు లేని రోజుగా చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను అని మీకు మీరే గుర్తు చేసుకోండి.  అంగీకారం మరియు గౌరవం యొక్క శక్తితో జీవిత ప్రవాహంలో ముందుకు వెళ్తూ ఉంటాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »
25th march 2025 soul sustenance telugu

ఆధ్యాత్మిక అవగాహనతో తోబుట్టువుల మధ్య వైరాన్ని అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు తోబుట్టువులు అనగా మీ సోదర సోదరీల మధ్య విభేదాలు ఉండటం సాధారణం, కానీ యుక్త వయసులో కూడా తోబుట్టువుల పట్ల అభద్రత

Read More »
24th march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు 

Read More »