Hin

25th feb 2024 soul sustenance telugu

February 25, 2024

ప్రతిరోజూ మీ ఆశీర్వాదాల ఖజానాను నింపుకోండి

మన నుండి, మన సంబంధీకుల నుండి మరియు భగవంతుని నుండి మనం ప్రతిరోజూ పొందే దీవెనలు ఒక గొప్ప శక్తి యొక్క  ఖజానా. మనం ఈ ఖజానాను ఎంత నింపుకుంటామో అంత అంతర్గత ఉన్నతిని పొందుతాము. మన ఆంతరిక శక్తి మరియు ఆనందం కూడా పెరుగుతాయి. రోజును ప్రారంభించినప్పుడు, మన గురించి మరియు మనం కలుసుకునే రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి గురించి విభిన్న ఆలోచనలను సృష్టిస్తాము. వారిని చూస్తుంటే, వారిలో అనేక ప్రత్యేకతలు మరియు బలహీనతలు కనిపిస్తాయి. మంచితనం ఉన్న వ్యక్తులతో మోహం,  మనతో ప్రతికూలంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల ద్వేషం కలగటం చాలా సహజం. అటువంటి పరిస్థితులలో, కొన్నిసార్లు మనం కొంతమందికి ప్రతికూల శక్తిని పంపి  వారి ఆశీర్వాదాలను పొందడం ఆపేస్తాము. అలాగే, మనం సరైన ఆలోచనలను  చేయము లేదా సరైన పదాలు మాట్లాడము లేదా సరైన రీతిలో చర్యలను చేయము. దానితో మనం చేసే ప్రతిదాన్ని చాలా సూక్ష్మంగా కూడా తెలిసి ఉన్న, చూస్తున్న భగవంతుని ఆశీర్వాదాలను కోల్పోతాము. కొన్నిసార్లు మన పనులు ఇతరులను దూరం చేస్తాయి, వారిని అసంతృప్తి పరుస్తాయి. అప్పుడు వారు చెడు, నెగిటివ్ శక్తిని పంపడం ప్రారంభిస్తారు.

ఇతరుల నుండి ప్రతికూల శక్తిని పొందడం మనల్ని ఉత్సాహరహితంగా చేస్తుంది. కొన్నిసార్లు మన జీవితాలను అడ్డంకులతో నింపుతుంది. మనం ఎల్లప్పుడూ ఇతరుల నుండి ఆశీర్వాదాలను ఎలా పొందుతాము మరియు ప్రతిరోజూ ఈ సంపదను ఎలా పెంచుకోవాలి? ప్రతిరోజూ మనం ఈ నిధిని ఎంతగా పెంచుకుంటే, అంతగా మన జీవితాలు మెరుగుపడతాయి. ప్రతి క్షణం తేజస్సు మరియు మంచిని చూస్తాము, ఇది మన జీవితానికి విలువను జోడిస్తుంది, శ్రేయస్సు యొక్క అనుభూతిని కూడా పొందుతాము. 7 ప్రాధమిక సుగుణాలను – శాంతి, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి, జ్ఞానం మరియు సంతోషం కలిగి ఉండటమే మన అసలైన స్థితి. మన వాస్తవిక స్థితికి సమీపంగా చేర్చే విధంగా మనం ఆలోచించినప్పుడు లేదా ఏదైనా చేసినప్పుడు, మనకు మనం ఆశీర్వాదాలను ఇచ్చుకుంటాము. ఇతరులు  వాస్తవిక స్థితికి సమీపంగా చేరుకోవడానికి మనం  ఏదైనా ఆలోచించినా, చేసినా వారి నుండి ఆశీర్వాదాలను పొందుతాము. అలాగే, మనం రెండింటినీ చేసినప్పుడు భగవంతుడి నుండి ఆశీర్వాదాలను పొందుతాము. అటువంటి ఆశీర్వాదాలతో నిండిన జీవితం నిరంతర సంతృప్తితో కూడిన జీవితం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th jan 2025 soul sustenance telugu

ఇతరుల సంతోషాన్ని ఆనందించడం

ఇతరులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పుడు, మీరు ఇంకా అక్కడికి చేరుకోనప్పుడు మీరు వారి కోసం నిజంగా సంతోషిస్తారా లేదాపై పైన సంతోషిస్తారా  లేదా అస్సలు సంతోషించరా? లోలోపల  మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా

Read More »
23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »