Hin

21st nov 2023 soul sustenance telugu

November 21, 2023

ప్రతిరోజూ మిమ్మల్ని మీరు మరింత సృజనాత్మకంగా చేసుకోండి

మనం మరింత సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటాము. ఒక గొప్ప ఆలోచన మన మనస్సుకు తట్టిన క్షణం, ఈ ఆలోచన ముందు ఎందుకు  రాలేదని ఆశ్చర్యపోతాము. నేను సృజనాత్మక వ్యక్తిని కాను , నేను కొత్తగా ఆలోచించలేను… అని మనం అనుకుంటాము. నిజానికి మనందరికీ సృజనాత్మక సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మనమందరం వాటిని పూర్తిగా ఉపయోగించము. మనం మన మనస్సును సరిగ్గా చూసుకుంటే, అది మనల్ని ఎప్పటికప్పుడు సృజనాత్మక ఆలోచనలు మరియు అవకాశాలతో నింపుతుంది.

 

మీ మాటలు మరియు చర్యలకు ఆధారం ఆలోచనలు. సృజనాత్మకత అంటే కొత్త ఆలోచనా విధానాలను అభివృద్ధి చేయడం, తద్వారా సరైన ప్రతిస్పందనలు అనగా ఎంపికలు, నిర్ణయాలు, కర్మలు మరియు పరస్పర చర్యలు ఎంచుకోగలరు.

మీ మనస్సును నిశ్శబ్దం చేయడానికి ప్రతి ఉదయం మెడిటేషన్ చేయండి. మీ అంతఃచేతన మనస్సులో కొత్త ఆలోచనా విధానాల విత్తనాలను నాటడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. ఆధ్యాత్మిక జ్ఞానంతో మీ ఆలోచనలు బాహ్య ప్రభావాల వలన కాకుండా మీ వివేకంతో సృష్టించబడతాయి.

అది చేతిలో ఉన్న పని అయినా, సంబంధం అయినా లేదా ఆరోగ్య సమస్య అయినా, కాసేపు ఆగి ఉండే ప్రాక్టీస్ చేయండి. ప్రతి సన్నివేశంలో, ఖచ్చితమైన ప్రతిస్పందన లేదా పరిష్కారాన్ని పొందడానికి మీ వివేకంతో ఆలోచించండి.

 

సృజనాత్మకతకు ప్రాథమికంగా ఉండాల్సింది శక్తి. మీరు సృజనాత్మకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు సవాలుగా ఉన్నా లేదా వ్యక్తుల ప్రవర్తనలు సరిగ్గా లేకపోయినా మీరు స్థిరంగా ఉంటారు. మీరు ఏదైనా సన్నివేశంలో రియాక్ట్ అయినప్పటికీ, మిమల్ని మీరు పరిశీలించుకుని భవిష్యత్తులో తగు విధంగా స్పందిస్తునట్లు విజువలైజ్ చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »