Hin

7th April 2025 Soul Sustenance Telugu

April 7, 2025

ప్రతిరోజూ ఒక విలువను తీసుకుని ఉపయోగించండి

ప్రతిరోజు మన జీవన ప్రయాణంలోని ప్రతి ఘట్టం, ఎలా ఉండాలి మరియు ఏమి చేయాలి అనే అనేక ఎంపికలను అందిస్తుంది. మనం ఏ నిర్ణయం తీసుకున్నా, అది మన విలువల ప్రతిబింబమే. శ్రద్ధ, సహనం, చిత్తశుద్ధి లేదా కృతజ్ఞత ఏదైనా కావచ్చు – విలువలు దిశను సూచిస్తూ జీవితానికి అర్థాన్ని ఇస్తాయి. మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలు మన విలువలకు అనుగుణంగా ఉంటే, మనం సుఖంగా ఉంటాము. కానీ ఏదైనా కారణం చేత మనం రాజీ పడితే, వైదొలిగితే లేదా విలువలను వదులుకుంటే, ముందైనా లేక తర్వాత అయినా మనం చింతిస్తాము. 

నైతిక జీవనాన్ని విశ్వసించే వ్యక్తిగా, మీరు విలువల దిక్సూచిని సృష్టించి, మీ ఎంపికలు మరియు నిర్ణయాలకు మార్గనిర్దేశం చేసేందుకు దాన్ని ఉపయోగించండి. కానీ మీరు ప్రపంచంలోకి బయలుదేరినప్పుడు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వారి విలువలపై రాజీ పడడాన్ని మీరు గమనించవచ్చు. ఆ క్షణాల్లో, మీది వదులుకోవడానికి మీరు టెంప్ట్ అవుతారా? మీరు ఎవరితో కలిసి జీవిస్తున్నారో, వారిలో ఆ విలువలు లేనందున మీరు ఏదైనా విలువను వదులుకున్నారా? విలువలే మన బలం. మన చుట్టుపక్కల ఎవరూ వాటిని ఉపయోగించనప్పటికీ, అవి పని చేయవని ఇతరులు విశ్వసించినప్పటికీ, మనం వాటిని వదులుకోకూడదు. కానీ చాలా సందర్భాల్లో, మన ప్రవర్తన ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారనే దానికి ప్రతిబింబంగా మారిపోతుంది, దాంతో మన స్వంత విలువలు కనుమరుగైపోతాయి. జీవన విలువలు అంటే మన సూత్రాల వర్ణపటాన్ని స్థిరంగా బలోపేతం చేసుకొని ప్రతిసారీ వాటిని అందరితో ఉపయోగించడం. ప్రలోభాలు మరియు సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మన విలువలకు కట్టుబడి ఉండటం మన శక్తిని పెంచుతుంది. విలువలు ఎల్లప్పుడూ మన అన్ని ఎంపికలు మరియు నిర్ణయాలలో ఉండాలి. అలా కాకుండా మనం వాటిని సౌకర్యం కోసం మాత్రమే ఉపయోగిస్తే, మన విలువలు వాటి విలువను కోల్పోతాయి. ఏదైనా ఒక విలువను ఎంచుకోండి, తదుపరి 24 గంటల పాటు, ఆ విలువ మీరు ఎవరో మరియు మీరు ఏమి చేస్తున్నారో ప్రతిబింబించేలా చేయడానికి కట్టుబడి ఉండండి. దీన్ని సర్వదా, సర్వులతో ఉపయోగించండి. మీరే గుర్తు చేసుకోండి – నేను ప్రతిరోజూ ఒక విలువను ఎంచుకుంటాను. నా ప్రతి ఆలోచన, మాట మరియు ప్రవర్తనలో నేను దానిని ఉపయోగిస్తాను. నా విలువలు నన్ను నిర్వచిస్తాయి. ప్రతి సన్నివేశంలోనూ వాటిని ఉపయోగిస్తూ నా వ్యక్తిత్వాన్ని బలపరుచుకుంటాను.

మీరు ఎంచుకున్న విలువ ప్రవర్తనా నియమావళి లాగా మారుతుంది, ఇది మీకు మరింత మెరుగ్గా మరియు ఇంకా మెరుగ్గా మారడంలో సహాయపడుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మరియు పరిస్థితులకు మీరు భిన్నంగా తయారవుతారు.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »