Hin

19th dec 2023 soul sustenance telugu

December 19, 2023

ప్రేమ మరియు ఆనందాలకు దూతలుగా అవుదాం (పార్ట్ 1)

జీవితం ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనమందరం పొందే అత్యుత్తమ అనుభవాలలో ప్రేమ మరియు ఆనందాలు ఉన్నాయి. మనం పుట్టినప్పటి నుండి ప్రేమ మరియు ఆనందం మనతోటే ఉన్నాయి. మన హృదయాలలో వాటిని పెట్టుకుని మనం పెరిగి పెద్దయ్యాం. అందరితో ఈ రెండు అందమైన భావోద్వేగాలను పంచుకుంటూ, తీసుకుంటూనే జీవితాన్ని గడిపాము.  మనిషికున్న ప్రతి ఉద్దేశం వెనక ఈ రెండు ఎమోషన్లు, వాటి అనుభూతి ఉండటాన్ని మనం చూసాం. నిజమే, ఇవి మన జీవితానికి చాలా ముఖ్యమైనవి, ఏ వయసులోనైనా అందమైన జీవితాన్ని జీవించడానికి ఇవే పునాదులు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఈ ప్రేమ మరియు ఆనందాలు ప్రపంచంలో పెరగడం లేదు, తగ్గుతున్నాయన్న ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మనుషులు మునుపటిలా కాక చాలా త్వరగా ఒకరికొరు దూరమవుతున్నారు, ఇతరుల కోసం హృదయంలో శుభ భావనలు నిండి లేవు. నిజానికి, ఆపేక్షలు మరియు కోరికలు అనే రెండు ముఖ్యమైన ప్రతికూల సత్తాలు ఈ సానుకూల రెండు సత్తాలను ప్రపంచంలో తగ్గించేస్తున్నాయి. ఈ ప్రపంచంలో మనం ప్రేమ మరియు ఆనందాలను పంచే దూతలుగా అవుదాం, అందుకు  ఇలా చేద్దాం:

  1. ప్రతి రోజూ ఉదయం, విశ్వంలోని ప్రతి ఒక్కరిపట్ల పవిత్రమైన ప్రేమ భావాలను ఏర్పరచుకుందాం, అలాగే రోజంతా ఎవరిని కలిసినాగానీ – స్నేహితులు, బంధువులు, ఆఫీసు సహోద్యోగులు మరియు కుటుంబం. ఉదయం లేవగానే, ప్రభాత ప్రతిజ్ఞ చేయండి – ప్రతి ఒక్కరూ నాకు సన్నిహితులే, నాకు వారితో చక్కని అనుబంధం ఉంది, నా తీయని మాటలు, చేతలు, కర్మలతో దీనిని నేను మరింత అందంగా చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రతి బంధం అందంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. అలాగే రోజూ ఈ ధృవీకరణలు చేయండి – నా ప్రతి బంధాన్ని సంతృప్తి, అవగాహన, అంగీకారం, వినయం, త్యాగం, ఇచ్చే గుణంతో సంపన్నంగా చేసుకుంటాను.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th dec 2024 soul sustenance telugu

సదా సంతృప్తిగా ఎలా ఉండాలి?

సంతృప్తి అంటే విషయాలు భిన్నంగా ఉన్నాయని అనుకోవటం కంటే, మనం ఎవరమానేదాన్ని  మరియు మన వద్ద ఉన్నదాన్ని మెచ్చుకోవడం. లక్ష్యాలను సాధించి, సౌకర్యవంతమైన జీవితాలను గడుపుతూ, ప్రతిదానిలో విజయం సాధించినప్పటికీ సంతృప్తి చెందని వ్యక్తులను

Read More »
8th dec 2024 soul sustenance telugu

నిర్భయంగా ఉండటానికి 5 మార్గాలు

స్వీయ గౌరవం యొక్క శక్తివంతమైన స్మృతిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించగల మొదటి, అతి ముఖ్యమైన మార్గం మన స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. ఇంకా, జ్ఞానం, సుగుణాలు, నైపుణ్యాలు మరియు

Read More »
7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »