Hin

20th dec 2023 soul sustenance telugu

December 20, 2023

ప్రేమ మరియు ఆనందాలకు దూతలుగా అవుదాం (పార్ట్ 2)

  1. జీవితం అనేది మనల్ని ప్రేమిస్తున్నారన్న అనుభూతిని కలిగించి, ఆనంద అనుభవాన్ని అందించే గొప్ప విజయాల సమాహారం. జీవితంలో అనేక అంశాలు ఉంటాయి – మనం ఎవరితో సమయాన్ని వెచ్చిస్తున్నాం, మన విద్య, మన ఆరోగ్యం, మన కెరీర్, మన భౌతిక వ్యక్తిత్వం, సంపద మొదలైనవి. సంతోషం అంటే ఇవన్నీ మంచిగా ఉంటేనే వచ్చేది కాదు. నిజానికి, ఇందుకు భిన్నమైనది. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కనుక, రోజూ మీతో మీరు సానుకూలంగా మాట్లాడుకోండి, వీటన్నిటి ప్రతికూల ప్రభావాన్ని లోపలకు తీసుకోకండి. మరో వైపు, మీ ఆంతరిక స్వభావాన్ని దివ్యంగా , ప్రేమానందాలతో నింపుకోండి. అనిశ్చితము మరియు అలజడులు ఉండే ఈ ప్రపంచంలో, ప్రతి ఒక్కరికీ ప్రేమ మరియు ఆనందాన్ని అందించే దూతలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకన్నా ఎక్కువ దుఃఖంగా, తక్కువ ప్రేమను పొందేవారు చాలామంది ఉన్నారు. మీ సంరక్షణ మరియు ఆధారము అనే చేయూతను వారికి అందించండి. వ్యక్తులను కలిసినప్పుడు, ఇది గుర్తుంచుకోండి – నేను విశేష ఆత్మను, ప్రేమానందాలు నిండిన ఆత్మను, అది పరమాత్మ ఇచ్చిన అదృశ్య ఆస్తి, ఇది నాకు వారి నుండి వారసత్వంగా లభించింది. జీవితంలో వచ్చే వివిధ దృశ్యాలలో నేను స్థిరంగా ఉంటాను. ప్రతికూల సన్నివేశాలతో అస్థిరంగా మరియు కలవరపాటుతో ఉన్నవారికి నేను సహాయం చేస్తాను.
  2. కోపంలేని ప్రాంతాలను మీ ఆఫీసులో, ఇంట్లో పెట్టుకోండి. కొన్ని కార్పొరేటు ఆఫీసులలో ఇటువంటి ప్రదేశాలను ఏర్పాటు చేసారు. ఈ ప్రదేశాలలో, పాజిటివ్ ఆలోచనలను ఈ మెయిల్స్ ద్వారా పంచుకుంటారు. ఇది సానుకూల రోజుకు పునాది వేస్తుంది. అలాగే, వారు కోపంలేని ప్రదేశం (నో ఏంగర్ జోన్)లో ఉన్నారని వారు గుర్తుంచుకుంటారు. అది గుర్తుండేలా ఆ పేరును ప్రదర్శిస్తారు. ఈ ప్రదేశంలో, కోపంగా మాట్లాడటం, గట్టిగా మాట్లాడటం, ఆవేశం, ప్రతీకార ప్రవర్తన, ఇతరుల గురించి ప్రతికూల మాటలు మాట్లాడకూడదు. ఇలా మీరు మీ ఆఫీసులో, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో కలిసి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి ప్రదేశాలు ప్రేమానందాల ప్రదేశాలుగా మారుతాయి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »