HI

21st dec 2023 soul sustenance telugu

December 21, 2023

ప్రేమ మరియు ఆనందాలకు దూతలుగా అవుదాం (పార్ట్ 3)

  1. మనం భగవంతుని సంతానమే కాదు మిత్రులం కూడా. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు, భగవంతుడికి అంకితం చేస్తూ అది విశేషంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాగే, వారి చేతిని పట్టుకొని, వారు మన చేతిని పట్టుకునే మార్గాన్ని ఇతరులకు కూడా తెలియచేయాలి. ఆధునిక జీవనశైలి, భౌతిక విజయాలున్నాబాధపడేవారు అనేక మంది ఉన్నారు. సంబంధాలు మోసపూరితమైనవి మరియు తప్పుదారి పట్టించేవి. శారీరక మరియు మానసిక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. జీవితంలోని ఏ రంగంలోనైనా మంచి, ముఖ్యమైన పాత్రధారులు మనల్ని సెకనులో వదిలివేయవచ్చు. మన జీవితంలో ఏమి జరిగినా మనల్ని విడిచిపెట్టని ప్రేమ, ఆనందాలకు మూలమైన వారు ఒకరు ఉన్నారు. వారే భగవంతుడు. వారిని విశ్వసించడం మరియు వారికి మీ జీవితాన్ని అర్పించడం ద్వారా, మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. ఒక వేళ సంతోషం అనేది సంబంధాలు, ఆస్తులు, జీతాలు, పదవులు, స్వంత భౌతిక శరీరం వంటి మార్పు చెందే వాటిపై ఆధారపడి ఉన్నట్లైతే, అది ప్రతిసారీ మిమ్మల్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. భగవంతుడిని తన నిరంతర సహచరుడిగా ఉంచుకునే వ్యక్తి ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంటాడు. ఆలా ప్రేమ, ఆనందాల సంపదలు సమృద్ధిగా ఉన్న వారు ప్రపంచమంతటికీ వాటిని పంచుతారు.

 

  1. చివరగా, మనమందరం ప్రపంచ వేదికపై నటులం. ప్రతి క్షణం, మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూస్తున్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మనమందరం మొదట ప్రేమగల, సంతోషకరమైన ఆత్మలం. మనం వివిధ జన్మల మెట్లు దిగుతున్న కొద్దీ, ప్రపంచ వేదికపై మన చర్యల నాణ్యత తగ్గుతూ వస్తున్నాయి. మనం అనేక జన్మలలో అనేక విధాలుగా ఇతరులకు అన్యాయం చేసాము. అందుకే ఈరోజు మనం ప్రతికూల ప్రవర్తనలు, మాటల రూపంలో ఇతరుల నుండి ప్రతికూల శక్తిని పొందుతున్నాము. నెగెటివ్ ఎనర్జీని పాజిటివ్‌గా మార్చుకోవాలంటే ప్రపంచ నాటక వేదికపై హీరో నటులుగా మారాలి. హీరో నటీనటులు తమ ప్రతి చర్య అందంగా, ప్రశంసనీయంగా ఉండేలా జాగ్రత్తపడతారు, ఇది అందరి హృదయాలను హత్తుకుంటుంది. అలాంటి హీరో నటుడు తమ ప్రతి చర్య ద్వారా ప్రేమ మరియు సంతోషాల సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేస్తాడు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »