Hin

30th august 2024 soul sustenance telugu

August 30, 2024

ప్రేమ మరియు బాధ కలిసి ఉంటాయా? (పార్ట్ 1)

ప్రేమ మరియు బాధ అనేవి జీవితంలో మనల్ని తాకే లేదా కదిలించే రెండు భావోద్వేగాలు. రెండూ పరిస్థితులకు స్పందిస్తూ మనం ఆంతరికంగా సృష్టించుకున్నవి. జీవితంలో ఎప్పుడూ ఉండే ఒడిదుడుకుల వలన ప్రేమ మరియు బాధ రెండూ వ్యసనాలుగా కనిపిస్తాయి, ఎందుకంటే మనం చాలా వరకు  ప్రేమించబడ్డామని లేదా బాధపడ్డామని భావిస్తాము. ప్రేమ మరియు బాధ గురించి 3 లోతైన తప్పుడు నమ్మకాలు ఉన్నాయి, వీటిని మనం పరిశీలించాలి:

  1. ప్రేమ బాధిస్తుంది –

ప్రేమ మనల్ని ఎన్నటికీ హాని చేయదు. మనల్ని తిరిగి ప్రేమించని వ్యక్తులు మనకు హాని చేయవచ్చు, కానీ ప్రేమ హాని చేయదు. ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉండవచ్చు. విడిపోవడం బాధాకరంగా ఉండవచ్చు. ఎవరైనా మనకు అబద్ధం చెప్పడం లేదా ద్రోహం చేయడం బాధాకరం… కానీ చాలా మంది ప్రేమను బాధాకరంగా భావిస్తారు. ఇకపై ఏ మనిషిని ప్రేమించకూడదని కూడా నిర్ణయించుకుంటారు. నిజమైన ప్రేమ ఎప్పుడూ బాధించదు, అది కేవలం నయం చేస్తుంది.

  1. ప్రియమైన వ్యక్తి ఆందోళనలో ఉన్నప్పుడు మనమూ తప్పకుండా బాధ పడతాము –

ప్రమాదానికి గురైన చిన్న పిల్లవాడి ఉదాహరణను పరిశీలించండి. విపరీతమైన నొప్పి, భయంతో అతను గంటలు లేదా రోజులు ఏడుస్తూ ఉండవచ్చు. ఆ సమయంలో అతను తన తల్లిదండ్రులు ఎలా ఉండాలని కోరుకుంటాడు? అతనితో పాటు ఏడ్చి అతని అభద్రతను పెంచాలా? లేదా బలమైన, స్థిరమైన మరియు ధైర్యవంతులైన తల్లిదండ్రుల్లా అతనిని ఉత్సాహపరచాలా – మేము నీ బాధను అర్థం చేసుకున్నాము. మేము ఎల్లప్పుడూ నీతోనే ఉంటాము. అత్యుత్తమ వైద్యులు నీకు వైద్యం చేస్తున్నారు. నీవు ఎంత త్వరగా కోలుకుంటున్నావో చూడు. నువ్వు చాలా ధైర్యవంతుడివి…

  1. ఎవరినైనా ప్రేమిస్తే వారు నాకే సొంతమని భావించేలా మరియు వారి గురించి చింతించేలా చేస్తుంది –

మొహం మనల్ని మనకే సొంతం అని భావించేలా లేదా ఆందోళనకు గురిచేస్తుంది. ప్రేమ అందరినీ ఎవరిని వారిలా ఉండేందుకు అనుమతిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ఎంత ఉన్నతమైన ఫ్రీక్వెన్సీతో ప్రసరిస్తుందంటే అక్కడకి నొప్పి, భయం, ఆందోళన మరియు అభద్రత వంటి తక్కువ శక్తులు చేరుకోలేవు. ఒకే సమయంలో, అయితే ప్రేమ అయినా ఉండవచ్చు లేదా బాధ ఉండవచ్చు – రెండూ ఉండజాలవు.

మన నమ్మకాలాను సరైనవిగా చేసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఏదైనా నమ్మకాన్ని స్వీకరించిన తర్వాత, మన జీవిన విధానం గణనీయంగా మారుతుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »
6th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు పాజిటివ్ సమాచారం మరియు ఆధ్యాత్మిక నషా – మనం ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాజిటివ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా

Read More »