Hin

31st august 2024 soul sustenance telugu

August 31, 2024

ప్రేమ మరియు బాధ కలిసి ఉంటాయా? (పార్ట్ 2)

మనలో ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమ స్వరూపులు. ఆ ప్రేమ బేషరతుగా పంచుకోవలిసనది. జీవితం అంటే ప్రేమని పంచుకోవడం – మన శరీరాన్ని ప్రేమించడం, స్వయాన్ని ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం, భగవంతుడిని ప్రేమించడం, ప్రకృతిని ప్రేమించడం, మన పనిని ప్రేమించడం…. ఆ ప్రేమ యొక్క శక్తి చివరికి మనల్ని శుద్ధి చేసి పరివర్తన అవ్వడానికి సహాయపడుతుంది. కానీ మనం ప్రేమను భయంతో లేదా బాధతో జోడిస్తే, స్వచ్ఛమైన ప్రేమకు ఆటంకం అవుతుంది. మనం చింతిస్తాము, బాధపడతాము మరియు భయపడతాము. ఈ క్షీణించిన మానసిక స్థితిలో, మనం సరిగ్గా లేదా చేయాల్సినంతగా సహాయం చేయలేము. భౌతికంగా మనం వారి కోసం ఎంతో చేసినప్పటికీ, మన ప్రతికూల వైబ్రేషన్లు నిరంతరం వ్యక్తికి ప్రసరిస్తాయి. మనం వారికి ఇబ్బంది కలిగించటం లేదా నియంత్రించడానికి చూస్తాము. ఇక వెంటనే మనం వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నామని అనుకుంటారు.

మనం మన వ్యక్తిగత జీవితాన్ని సమీక్షించుకుంటే, ప్రియమైనవారి వల్ల మనం చాలా బాధలను అనుభవించి ఉంటాము. నాకే సొంతమనే భావన, నియంత్రణ, సమర్పణ మరియు ఆధారపడే భావం  మన నుండి వారికి లేదా వారి నుండి మనకు ప్రసరిస్తున్నప్పుడు అటువంటి వివరించలేని బాధ కలుగుతుంది. ఈ నలుగింటిలో ఏదీ స్వచ్ఛమైన లేదా దివ్యమైన ప్రేమగా అనబడవని గమనించండి. మనం జీవితంలో కొందరిని ఆశీర్వాదంగా చూస్తాం. వారు మనల్ని ప్రేమిస్తారు, మనకు సహాయం చేస్తారు, మనల్ని ప్రోత్సహిస్తారు మరియు అనేక విధాలుగా మనకు సేవ చేస్తారు, తద్వారా మనం మానసికంగా రుణపడి ఉంటాము. కానీ కొన్ని కారణాల వల్ల మనం విడిపోతే, మన అపారమైన ప్రేమ విడిపోయే బాధను అధిగమించనివ్వడం లేదని నిందలు వేస్తాము. ఇది నిజం కాదు. మరణం లేదా మరేదైనా కారణంతో విడిపోవడం పూర్తిగా కర్మ ఫలం. ప్రతి ఆత్మ వారితో మన కర్మల ఖాతాను బట్టి నిర్ణీత కాలం వరకు మనతో ఉంటారు. కాబట్టి, మనం సరైన అవగాహనతో ఒకరికొకరు స్వచ్ఛమైన ప్రేమను ప్రసరింపజేయడం కొనసాగించాలి.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »