Hin

1st sep 2024 soul sustenance telugu

September 1, 2024

ప్రేమ మరియు బాధ కలిసి ఉంటాయా (పార్ట్ 3)?

మనం తీవ్రమైన భావోద్వేగ బాధను అనుభవిస్తున్నప్పుడు, మన నిజమైన స్వశక్తిని తెలుసుకొని ప్రేమను  అనుభవం చేసుకోవడానికి కష్టపడతాము. మనకు బాధ కలిగే పరిస్థితిలో మనం ఉంటే ఆ భావోద్వేగం నుండి వైదొలగి మనస్సును స్థిరపరచాలి.

బాధని ప్రతిఘటించకుండా లేదా భయపడకుండా గమనించాలి. దేని వల్ల ఆ బాధ ప్రేరేపించబడిందో జాగ్రత్తగా చెక్ చేసుకోవటం ముఖ్యం. సమాధానం సాధారణంగా ఇతర వ్యక్తులతో జోడించబడి ఉంటుంది –

– అతను/ఆమె నన్ను ఇక ప్రేమించడం లేదు, అందుకే నేను బాధపడుతున్నాను

– మునుపటిలా ఏమీ లేవు

– ఈ వ్యక్తి యొక్క సాంగత్యం నాకు ఒకప్పుడు ఇచ్చిన ఓదార్పుని ఇప్పుడు ఇవ్వడం లేదు.

మనల్ని బాహ్యంగా ఏదైతే ప్రేరేపిస్తుందో దానిని అర్థం చేసుకున్న తర్వాత, మనం ఈ క్రింది సూక్ష్మమైనవి చెక్ చేసుకోవాలి, ఇది కొంచెం లోతుగా ఉంటుంది –

– మనల్ని ప్రేమించిన వ్యక్తి మనల్ని ప్రేమించడం మానేస్తే, వారి ప్రవర్తన మనకు బాధను కలిగిస్తుందా? లేక ఆ వ్యక్తి ప్రేమ కోసం మన స్వంత నిరీక్షణ మరియు కోరికనా?

– మనం మార్పులను అంగీకరిస్తున్నామా లేదా వాటిని వ్యతిరేకిస్తున్నామా?

– మనం ఇతరులపై నిందను మోపి బాధలోనే జీవిస్తూ హాయిగా ఉండటం ప్రారంభించామా –  కొంత కాలానికి ఈ భావోద్వేగాలకు కొద్దిగా  బానిసల్లా అయ్యామా?

చాలా మంచి సంబంధం కూడా క్షణంలో బాధకు మూలంగా మారుతుందని మన వ్యక్తిగత అనుభవాల నుండి తెలుసుకున్నాము. నిజం ఏమిటంటే, మనం బాధలను ఎంచుకుంటాము, అవతలి వ్యక్తి మనకు బాధ కలిగించలేడు. మనల్ని మానసికంగా ఎవరూ గాయపరచలేరు. మన ఆపేక్షలు పూర్తవ్వని ప్రతి సారీ బాధపడుతూ ఉంటాం. ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసం మనకు సానుకూలతను, ప్రతిదాన్ని మనం ఎంచుకున్నట్లుగా అంగీకరించే శక్తిని ఇస్తుంది. ఇది మొదట వ్యక్తులను ఎవరిని వారిని వారిలాగే అంగీకరించి, ఆపై సరైన చర్య తీసుకోవాలని మనకు బోధిస్తుంది. ఇది స్వచ్ఛమైన ప్రేమ యొక్క మూలానికి మనలను కలుపుతుంది – భగవంతుని బేషరతు ప్రేమ. ఈ కనెక్షన్ మన భావోద్వేగ అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది, తద్వారా వ్యక్తుల పట్ల మన ప్రేమ, గౌరవం సహజంగా ప్రవహించడం ప్రారంభమవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »