Hin

12th august 2024 soul sustenance telugu

August 12, 2024

ప్రేమ నాకు హాని చేయగలదా?

మనం జీవితంలో అనేక కొత్త సంబంధాలు కలుపుకున్నప్పుడు, మన లోతైన ఆలోచనలు మరియు భావాలను వారితో పంచుకోవడం ద్వారా కొంతమంది వ్యక్తులకు మన అంతర్గత భావోద్వేగాల ప్రపంచానికి అనుమతిని ఇస్తాము. వారు కూడా తమ అంతర్గత ప్రపంచాన్ని పరస్పరం పంచుకున్నప్పుడు, మనము ఆ సంబంధాన్ని విలువైనదిగా భావిస్తాము.  కానీ సమయం గడిచేకొద్దీ, ప్రేమను  మొహంను  కలిపేస్తాం. మోహము అనేది అస్థిరమైన భావోద్వేగం-ఇది అనంతమైన  ఆనందానికి మూలం కావచ్చు, కానీ అది లోతైన గాయాలను కూడా రేపగలదు. ప్రేమ అంటే ఇరువురి ఆనందం  కోసం అవతలి వ్యక్తిని కలుపుకోవడం. ప్రేమ ఉన్నప్పుడు మనం ఇతరులని బాగా చూసుకుంటాము, ఇతరులకు  అవసరమైన స్వేచ్ఛను ఇస్తాము మరియు వారిని కోల్పోతామని భయపడము. కానీ మోహము ఉన్నప్పుడు, సంబంధం ప్రత్యేకమైనదిగా లేదా స్వార్ధంగా మారుతుంది అంటే వారు కలత చెందినప్పుడల్లా, వారి ప్రవర్తన మారినప్పుడల్లా మనము బాధపడతాము. వారిని కోల్పోతామని మనం భయపడి బాధపడతాము. నేను వారిని ప్రేమిస్తున్నాను కానీ వారు నన్ను బాధపెట్టారు – అని మనము నమ్ముతాము. ప్రేమ హాని చేయదు కనుక ప్రేమించే వారు బాధించలేరు. వారి పట్ల ప్రేమ పేరిట మనకున్న మోహము మన బాధను సృష్టిస్తుంది.

తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తోబుట్టువులు లేదా స్నేహితులు ఎవరినైనా ప్రేమించడం అనేది చాలా సహజం. మొహం ఉన్నప్పుడు అలాంటి ప్రేమ, శ్రద్ధ మరియు సాన్నిహిత్యం మనల్ని బాధకు దగ్గర చేస్తాయని అర్థం చేసుకోవడానికి చేతన అవగాహన అవసరం. మనం సంబంధాల లేబుల్లతో గుర్తించడం మానేసి, అందరినీ స్వచ్ఛమైన ఆత్మలుగా చూసినప్పుడు, మనం మొహం లేకుండా ప్రేమను అనుభవిస్తాము. మన దగ్గరి సంబంధాలను సూక్ష్మంగా పరిశీలించి, మనం వారిని ప్రేమిస్తున్నామా లేదా మొహంతో ముడిపడి ఉన్నామా అని తనిఖీ చేద్దాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »