Hin

13th nov 2023 soul sustenance telugu

November 13, 2023

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు మనల్ని ప్రేమిస్తున్నారని భావిస్తాం. వారికున్న ప్రేమ కారణంగా  వారు ఈ ఈ విధంగా మన కోరికలు తీరుస్తారు అని మనం వారి గురించి ఒక స్ర్కిప్టును కూడా మనసులో తయారు చేసుకుంటాం. ఏ రోజైతే వారు అంచనాలకు తగ్గట్లుగా ఉండరో, మన అవసరాలకు అనుగుణంగా ఉండరో, కారణం ఏదైనా కావచ్చు, మనకు కోపం వస్తుంది.

ఈ క్షణం మీ మనసుకు నేర్పించండి – వ్యక్తులు మీకు తగ్గట్లుగా లేనంత మాత్రాన వారు మిమ్మల్ని ప్రేమించడం లేదని అర్థం కాదు.

సానుకూల ఆలోచన –

నేను సంతోషంగా ఉండే వ్యక్తిని… నేను నా పద్ధతిలో సంతోషంగా ఉంటున్నాను… నాకు ఎవరినుండి ఎటువంటి ఆపేక్షలు లేవు… నేను వారి నుండి ప్రేమను ఆశించడం లేదు… నేను ప్రేమ స్వరూపాన్ని…  నేను ఏమీ ఆశించకుండానే సలహాలను ఇస్తాను… అది వారు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు… వారు నన్ను ప్రేమిస్తున్నారు… అయితే నేను చెప్పిన ప్రకారంగా వారు చేయలేకపోవచ్చు… వారికున్న ప్రేమను, వారు చేసే పనులతో నేను సరి పోల్చి చూడను… వారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ ఆ క్షణంలో, నేను వారికి చెప్పిన పనిని చేయలేకపోవచ్చు… వారు నేను చెప్పింది వినకపోవచ్చు… నా సలహాను వారు పాటించకపోవచ్చు… వారి ఆలోచనలు, వారి స్వభావాలు, వారి శక్తి, వారి ప్రాధాన్యతల ప్రకారంగానే వారు ప్రవర్తిస్తారు… అవి నా వాటితో సరి పోలవు. నేను వారిని అర్థం చేసుకుంటాను… వారు నాలా ఉండాలని నేను ఆశించడం లేదు… నేను నా మనసుతో మాట్లాడుతున్నాను… ఇది వారి విధానం అని మనసుకు నచ్చ చెప్తున్నాను… వారి ప్రేమను నా మనసు ప్రశ్నించడం లేదు… నా మనసు నా మాట విని నిదానిస్తుంది… నేను వారితో ప్రేమ మరియు గౌరవ భావాలతో స్పందిస్తున్నాను… నాకు ఎవ్వరినుండీ ఏమీ వద్దు.

ఈ ఆలోచనలను కొన్ని సార్లు రిపీట్ చేయండి. మనల్ని ప్రేమించేవారు మనం చెప్పిన విధంగా చేయాలన్న నిర్వచనాన్ని మార్చుకోండి. ప్రేమను, ఆపేక్షలను విడిగా చేసినప్పుడు, ఇతరులను అర్థం చేసుకోవడం, వారిని అంగీకరించడం సహజమైపోతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

Aalochanalu mariyu chitraala sukshma paatra (part 2)

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మమైన పాత్ర (పార్ట్ 2)

ఆత్మ సృష్టించే ఆలోచనలు, చిత్రాల నాణ్యత అనేది ఆత్మ యొక్క సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. నాణ్యతను బట్టి, ఆత్మ సానుకూలమైన లేదా ప్రతికూలమైన వివిధ భావోద్వేగాలను అనుభవం చేసుకుంటుంది. పరంధామం నుండి భౌతిక ప్రపంచ

Read More »
Aalochanalu mariyu chitraala sukshma paatra (part 1)

ఆలోచనలు మరియు చిత్రాల సూక్ష్మ పాత్ర (పార్ట్ 1)

మానవ ఆత్మ ఒక సూక్ష్మమైన (భౌతికం కాని) స్టేజి. నిద్రిస్తున్నప్పుడు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, రోజంతా మరియు నిద్రిస్తున్నప్పుడు కూడా ఆలోచనలు, చిత్రాల సూక్ష్మ పాత్ర నిరంతరం దానిపై జరుగుతుంది. మన ఆలోచనలు 4

Read More »
కార్యాలయంలో నిజాయితీ

కార్యాలయంలో నిజాయితీ

మీ కార్యాలయంలో నిజాయితీ అనేది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, విజయం మరియు సంతుష్టతలకు రహస్యం కూడా. నిజాయితీని విలువైనదిగా భావించే ఉద్యోగికి విజయం, నమ్మకం లభిస్తాయి. మన నిజాయితీ విషయంలో రాజీ

Read More »