Hin

7th july 2024 soul sustenance telugu

July 7, 2024

ప్రియమైన వ్యక్తి మరణాన్ని ఎదుర్కోవటానికి 5 చిట్కాలు

1. స్వయాన్ని మరియు ఆ ప్రియమైన వ్యక్తిని ఒక ఆత్మగా అనుభవం చేసుకోండి – ఆకస్మిక మరణంతో మీ కుటుంబం కదిలిన క్షణం, ప్రతిరోజూ మీకు మీరు కొన్ని సార్లు గుర్తు చేసుకోండి – మేము మరియు మమ్మల్ని విడిచిపెట్టిన ప్రియమైన వ్యక్తి ప్రత్యేకమైన ఆత్మలం … మనం వైబ్రేషన్ల ద్వారా అనుసంధానించబడి ఉన్నాము… మనం ఆత్మకు శాంతి, ప్రేమ మరియు శక్తి యొక్క వైబ్రేషన్లను ప్రసరింపజేస్తాము. ఆత్మ తన కొత్త కుటుంబం మరియు వాతావరణంలో సంతోషంగా ఉంది.
2. మీ ఇంట్లో సమిష్టిగా సానుకూల చైతన్యాన్ని సృష్టించుకోండి – మీ ఆలోచనలు శక్తివంతంగా మరియు జ్ఞానంతో నిండి ఉండకపోతే, ఒకరిని కోల్పోవడం మీకు, మీ కుటుంబానికి బాధ కలిగించవచ్చు. కాబట్టి మొత్తం కుటుంబం వారి ఆధ్యాత్మిక రోగనిరోధక శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. కుటుంబీకులు అందరూ సానుకూల జ్ఞానాన్ని కలిసి చదవడం మరియు వినడం అందరి సాధికారతకు సహాయపడుతుంది.
3. మీ సంభాషణలను సానుకూలంగా మరియు శక్తివంతంగా చేయండి – కుటుంబ సభ్యుడిగా మీ కుటుంబం యొక్క భావోద్వేగ బాధ్యతను తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరూ నిస్సహాయత మరియు విచారం యొక్క ప్రతికూల సంభాషణలలో పాల్గొనకుండా చూసుకోండి. మీ కోసం, మీ కుటుంబం కోసం మరియు ప్రియమైన వ్యక్తి కోసం మీరు మాట్లాడే మాటలు సానుకూలత మరియు శక్తితో నిండినప్పుడు, అది కుటుంబంలో ఒకరికొకరు సాయపడే వైబ్రేషన్లను సృష్టిస్తుంది.
4. ఎవరి నుంచైనా ఏ బాధను గ్రహించవద్దు – మరణం ప్రతికూల వాతావరణం సృష్టించగలదు కనుక భగవంతునితో సన్నిహితంగా ఉండటం చాలా ముఖ్యం. ఇతర కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి బాధను గ్రహిస్తూ ప్రతికూల ఆలోచనలను సృష్టించకూడదు. కుటుంబం ప్రతి క్షణం ఒకరితో ఒకరు మరియు భగవంతునితో ఎంత ఐక్యంగా ఉంటుందో, అది అంత స్థిరంగా ఉంటుంది.
5. భవిష్యత్తు కోసం సానుకూల దృక్పథాన్ని సృష్టించండి – ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం కుటుంబాన్ని కలవరపెడుతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ ముందుకు సాగడం, సానుకూల చర్యలు మరియు అలవాట్లలో తనను తాను బిజీగా ఉంచుకోవడం, సానుకూల వ్యక్తులతో సంభాషించడం గురించి స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. సానుకూల శక్తిని ఉపయోగిస్తూ, ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే జీవితంలోని ప్రతికూల సమయంలో ఆత్మ యొక్క శక్తి సామర్ధ్యాలను పెంపొందిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »