Hin

5th feb 2025 soul sustenance telugu

February 5, 2025

ప్రియమైనవారి నుండి తిరస్కరణను సంభాళించటం

వ్యక్తులు మనల్ని విమర్శించినప్పుడు, మన అపేక్షలను పూర్తి చేయనప్పుడు, మనల్ని అవమానించినప్పుడు, వారు మనల్ని తిరస్కరించినట్లు మనం భావిస్తాము. ఇది మనల్ని హీనంగా మరియు అవసరం లేని వారిగా భావించేలా చేస్తుంది. మనం ఎవరినైనా ప్రేమించవచ్చు, మన జీవితం ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు. కానీ వారు మనతో అదే విధంగా వ్యవహరించకపోతే, వారు మనల్ని తిరస్కరించారని మనం భావిస్తాము.

 

  1. కొన్ని సార్లు మీరు ఇలా అనుకుంటున్నారా – వారు నన్ను తిరస్కరించారు… వారు నన్ను ప్రేమించరు… నేను అందరినీ చూసుకుంటాను… నన్ను ఎవరూ పట్టించుకోరు. మీ గురించి వ్యక్తులకు వారి స్వంత అభిప్రాయాలు ఉంటాయి. అలాగే, మీరు ఒకేలా ఉన్నప్పటికీ, ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం కాలానుగుణంగా మారుతుంది.

 

  1. వ్యక్తులు మీతో సరిగ్గా లేనందున, దానిని తిరస్కరణతో ముడిపెట్టవద్దు. బహుశా వారి ఉద్దేశాలు మంచివే కానీ ప్రవర్తన సరైనదిగా కాకపోవచ్చు. కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రవర్తనలను దాటి వెళ్ళండి – వారి మూడ్ బాగలేకపోవచ్చు లేదా ప్రతికూల పరిస్థితి మధ్యలో ఉండవచ్చు. వారికి సహాయపడుతూ మీ శుభకామనలు  మరియు ఆధ్యాత్మిక ప్రేమను వారికి పంపండి.

 

  1. అందరితో ఉండటం ఆనందిస్తూ వారితో అందమైన సంబంధాలను ఏర్పరచుకోండి. కానీ మీ ఆనందం ఎవరిపైనా ఆధారపడి ఉండనివ్వవద్దు. ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినప్పటికీ, మీరు మీలాగే ఉండండి – అపేక్షలు లేకుండా, మీ సామర్థ్యం మేరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి. మీ స్వచ్ఛమైన తరంగాలు వారిని ప్రభావితం చేయనివ్వండి.

 

  1. అందరూ మీ గురించి ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. మీరు మీ గురించి ఏమనుకుంటున్నానేది చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు బేషరతుగా ప్రేమించండి మరియు అంగీకరించండి. మీ ప్రధాన విలువల పట్ల మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి మరియు బేషరతుగా ఇవ్వడానికి మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి ప్రతిరోజూ మీలో మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »