Hin

11th feb 2025 soul sustenance telugu

February 11, 2025

పునర్జన్మ అనేది వాస్తవమేనా ? 

మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి.  అలాగే, మనం ఎప్పటికప్పుడు భౌతిక వస్త్రాలు లేదా శరీరాలను మార్చుకుంటూ జనన-మరణ చక్రంలోకి వస్తాము అనేది సాధారణంగా అంగీకరించబడిన వాస్తవం. దీన్నే పునర్జన్మ అంటారు. అదే సమయంలో, పునర్జన్మను నమ్మని మరియు ఇది కేవలం ఒక ఊహ అని భావించే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. జీవితం ఒక భౌతిక విషయం మాత్రమే మరియు అన్ని ఆలోచనలు మరియు విజువలైజేషన్ మెదడు చేత చేయబడుతుంది కానీ ఆత్మ కాదని అంటారు వాళ్లు. సంస్కారాలు లేదా స్వభావం అనేది మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన భౌతిక జన్యువులు తప్ప మరొకటి కాదని, అవి ఆత్మ ద్వారా తీసుకువెళ్ళబడవని కూడా వారు నమ్ముతారు.

 

భగవంతుడు కూడా మనలాగే ఆధ్యాత్మిక శక్తి అని, వారు జనన-మరణ చక్రంలోకి  రారని ఆధ్యాత్మికత మనకు ముఖ్యమైన జ్ఞానాన్ని ఇస్తుంది. వారు నిరంతరం పరంధామంలో ఉంటారు. భూమి మీదకు ఒక్కసారి మాత్రమే దిగి వస్తారు, అది ప్రపంచం దాని ఆధ్యాత్మిక శక్తిని కోల్పోయి, లక్షణాలలో దిగజారినప్పుడు వస్తారు. భగవంతుడు భూమిని మరియు భూమిపై తమ పాత్రను పోషించే ఆత్మలందరినీ తన ఆధ్యాత్మిక సుగుణాలతో నింపి, ప్రపంచాన్ని మళ్లీ ఉన్నతంగా చేస్తారు. వారు ఇనుప యుగం లేదా కలియుగాన్ని స్వర్ణ యుగం లేదా సత్యయుగంగా మారుస్తారు, దీనిని స్వర్గం లేదా హెవెన్ అని కూడా పిలుస్తారు. భగవంతుడు భూమిపైకి వచ్చినప్పుడు పునర్జన్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. స్వర్ణయుగం ప్రారంభం నుండి ఇనుప యుగం ముగింపు వరకు వివిధ భౌతిక వస్త్రాల ద్వారా ఆత్మలు తమ పాత్రలను ఎలా పోషిస్తాయో మనకు చెప్తారు. భగవంతుడు ఆత్మలను స్వచ్ఛంగా చేసిన తరువాత మళ్లీ తిరిగి స్వర్ణ యుగంలో పాత్రను పోషిస్తాయి. స్వర్ణయుగం నుండి ఇనుప యుగం వరకు ఈ చక్రం మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది.

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »