Hin

25th october 2024 soul sustenance telugu

October 25, 2024

రాజయోగ ధ్యానంతో ఆత్మను శుద్ధి చేయడం

మనందరం ఆధ్యాత్మిక శక్తులము లేదా ఆత్మలము. మనం ప్రపంచ నాటకంలో అనేక జన్మలుగా వివిధ   కర్మలు చేస్తాము. ఆత్మ మొదట తన ఇల్లు అయిన శాంతిధామంలో నివసిస్తుంది,  వివిధ భౌతిక శరీరాలలో విభిన్న పాత్రలను పోషించడానికి భౌతిక ప్రపంచంలో వస్తుంది. ప్రతి ఆత్మ యొక్క కర్మలు తన నిజమైన స్వచ్ఛత మరియు ప్రత్యేకమైన సంస్కారాలను బట్టి భిన్నంగా ఉంటాయి. ఆత్మలందరు అనేక సంబంధాలలో , అనేక  జన్మలలో ఇతరులకు సుఖాన్ని మరియు దుఃఖాన్ని ఇస్తారు. అలాగే, ఆత్మలు ప్రతి జన్మలో పంచ తత్వాలతో కనెక్ట్ అయ్యి  ప్రకృతితో సానుకూలంగా లేదా ప్రతికూలంగా కర్మ ఖాతాలను ఏర్పరుచుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇతర ఆత్మలతో సృష్టించబడిన కర్మ ఖాతాలతో పాటు ప్రకృతితో ఉన్న కర్మ ఖాతాలు ఆ ఆత్మ తన పునర్జన్మల ప్రయాణంలో ఎంత అపవిత్రంగా మారుతుందో నిర్ణయిస్తుంది. వేలాది సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆత్మలు  తనను తాను శుద్ధి చేసుకోవడానికి, తన ఇల్లు అయిన శాంతిధామానికి తిరిగి వెళ్ళడానికి ఏమి చేయాలని ఆలోచిస్తున్నారు. ఆత్మ తనను తాను పూర్తిగా శుద్ధి చేసుకునే వరకు తన అసలు ఇంటికి తిరిగి వెళ్లలేదు .

భగవంతుడు మన పరమ పిత మరియు పరమ ఆత్మ. వారు మానవ ఆత్మల వలె జనన-మరణ  చక్రంలో రారు. అందుకే భగవంతుని పవిత్రత ఎన్నటికీ తగ్గదు, వారు శాశ్వతమైన పవిత్రత సాగరుడు. ప్రతి మానవ ఆత్మ యొక్క విభిన్న జన్మలు, విభిన్న కర్మలు మరియు ఆత్మ మొదట ఎంత స్వచ్ఛంగా ఉందో పూర్తి జ్ఞానం కలిగి ఉన్నవారు వారు ఒక్కరే. అలాగే, ఆత్మిక స్మృతి  ఆధారంగా చేసే కర్మలు  సరైన చర్యలు అని, దైహిక స్మృతి ఆధారంగా చేసే కర్మలు తప్పుడు చర్యలు అని, అవి ఆత్మను అపవిత్రం చేస్తాయని వారికి తెలుసు. ప్రస్తుతం, కలియుగం లేదా ఇనుప యుగం చివరి సమయంలో ఆత్మలు చాలా అపవిత్రంగా మారినప్పుడు, భగవంతుడు రాజయోగ ధ్యానం యొక్క అభ్యాసాన్ని బోధిస్తాడు. ఇది స్వయాన్ని ఆత్మగా అనుభూతి చెంది శాంతిధామంలో సర్వోన్నతుడైన భగవంతుడిని గుర్తుంచుకునే టెక్నిక్. ఈ ధ్యానంలో, ఆత్మ భగవంతుని ముందు తనను తాను విజువలైజ్ చేసుకుని భగవంతుడిని చైతన్యమైన అత్యున్నత బిందువుగా అనుభూతి చేసుకుంటుంది.  వారి సానుకూల ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రకంపనలను గ్రహిస్తుంది. ఇది ఆత్మ తన గత జన్మలలో చేసిన ప్రతికూల చర్యల నుండి ఏ సంస్కారాలను కలిగి ఉన్నా దానిని శుభ్రపరుస్తుంది మరియు ఫలితంగా ఆత్మ శుద్ధి చేయబడి మళ్లీ శుభ్రంగా అవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »