Hin

19th august 2024 soul sustenance telugu

August 19, 2024

రాఖి పండుగ యొక్క ప్రాముఖ్యత

రాఖి పండుగ అనేది (ఆగస్టు 19) శుభాకాంక్షల తెలుపుకోవడం, తిలకం పెట్టడం , కంకణం కట్టడం, స్వీట్లు ఇవ్వడం, ఆపై బహుమతులు ఇచ్చిపుచ్చు కోవడంతో ప్రారంభమవుతుంది.

  1. శుభాకాంక్షలు– మన ప్రతి ఆలోచన మరియు మాట అందరికీ ఒక ఆశీర్వాదంగా ఉండాలి. వారి సంస్కారాలు మరియు ప్రవర్తనలతో సంబంధం లేకుండా, వారి సంస్కారాలను మార్చుకోవడానికి వారికి అధికారం ఇచ్చే స్వచ్ఛమైన మరియు సానుకూల ఆలోచనలు మరియు పదాలను మాత్రమే మనం రచిద్దాం. మనం వారికి ఆశీర్వాదాలను ప్రసరింపజేస్తే , అది వారి వాస్తవికతగా మారి వారి భాగ్యాన్ని మారుస్తుంది. మనం ఇంకా పట్టుకున్న గత బాధలన్నీ మనకు అశుద్ధమైన మరియు ప్రతికూల కంపనాలను ప్రసరింపజేస్తాయి కనుక మనం వాటిని తొలగించుకుందాం.
  2. తిలకం – మనము మూడవ నేత్రము అనగా ఆత్మ అనే స్పృహకు గుర్తుగా భృకుటి పై  తిలకాన్ని పెడతాము. తిలకం పెదట్టడం అంటే నేను ఈ శరీరం, పాత్రలు మరియు సంబంధాలు కాదన్నా వాస్తవాన్ని మేల్కొల్పడం. నేను దివ్య ఆత్మను, నేను సంభాషించే ప్రతి ఒక్కరూ ఒక దివ్య ఆత్మయే . ఇది ఈ జీవితంలో మనం పొందిన ప్రతిదాని పట్ల మన దైహిక స్మృతిని అంతం చేస్తుంది. దైహిక స్మృతి అనేది అన్ని వికా రాలకు పునాది. ఆత్మిక స్మృతి  అన్ని సద్గుణాలకు పునాది.
  3. రాఖీ-రాఖీ అనే పదం రక్ష అనే పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం రక్షణ. రాఖీ కట్టడం అనేది ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో రక్షణ అయిన మన స్వచ్ఛత మరియు ప్రేమ యొక్క వాస్తవిక సంస్కారాలను ఉపయోగిస్తామన్న మన ప్రతిజ్ఞకు ప్రతీక.  రాఖి మన మణికట్టు మీద కట్టబడినప్పుడు, మనం స్వయంతో మరియు భగవంతునికి చేసిన వాగ్దానం మనకు గుర్తుచేస్తుంది.
  4. స్వీట్లు-మన ఆలోచనలు, భావాలు, ఉద్దేశాలు మరియు మాటలు ఎల్లప్పుడూ మధురంగా ఉండాలన్న దానికి గుర్తు. ఇది మన సంబంధాలలో సామరస్యాన్ని సృష్టిస్తుంది.
  5. బహుమతులు-మనల్ని ఇబ్బంది పెడుతున్న ఏదైనా వ్యసనం, అలవాటు లేదా సంస్కారాన్ని ఎంచుకొని, ఈ రాఖి పండుగ రోజున దానిని వదులుకుందాం. ఇది మనకు, మన కుటుంబానికి మరియు భగవంతునికి ఇవ్వగల ఉత్తమ బహుమతి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »