Hin

29th march 2025 soul sustenance telugu

March 29, 2025

రెజ్యూమ్ తో మాత్రమే కాకుండా, వారి వైబ్రేషన్ల ఆధారంగా ఉద్యోగులని ఎంపిక చేయండి

మీరు మీ కార్యాలయానికి లేదా ఇంటికి ఉద్యోగులను నియమిస్తున్నపుడు, వారి నైపుణ్యాలను అంచనా వేయడంతో పాటు, వారి సంస్కారాలను కూడా గ్రహించడం చాలా ముఖ్యం. ఒక సంస్థ నాయకుడిగా లేదా కుటుంబ అధిపతిగా, సరైన ఉద్యోగులను నియమించడం ఒక ముఖ్యమైన నైపుణ్యం. అది మీ కుటుంబం మరియు సంస్థ యొక్క దీర్ఘకాలిక శ్రేయస్సుకు ముఖ్యమైనది. వ్యక్తులు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం, వారు ప్రసరించే వైబ్రేషన్స్ ను అనుభూతి చెందడం.

 

  1. వ్యక్తులు తమ ఆలోచనలు మరియు మాటల ప్రకంపనలను నిరంతరం ప్రసరింపజేస్తారు. కొంచెం శ్రద్ధ, అభ్యాసం మరియు జ్ఞానంతో మీరు వారి వ్యక్తిత్వాన్ని లేదా శక్తిని సరిగ్గా గ్రహించవచ్చు. ఒక వ్యక్తి అబద్ధం చెప్పవచ్చు లేదా కృత్రిమంగా ఉండవచ్చు, కానీ వారి వైబ్రేషన్లు అబద్ధం చెప్పవు, వారి లోపల ఉన్న సత్యాన్ని దాచలేవు. కాబట్టి వారు చెప్పేదానిపై మాత్రమే దృష్టి పెట్టడానికి బదులు, వారి సమక్షంలో మీకు ఎలా అనిపిస్తుందనే దానిపై శ్రద్ధ వహించండి మరియు మీ అవగాహన ఆధారంగా వారిని సరిగ్గా అంచనా వేయండి.

 

  1. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తాము నిజంగా ఎవరో అనే దాని గూరించి అతిగా చెప్పవచ్చు లేదా తక్కువగా చెప్పవచ్చు. వారి నైపుణ్యాలు, అనుభవం మరియు విజయాలపై వారిని అంచనా వేయడం మంచిది. కానీ వాటిని ప్రామాణికంగా తెలుసుకోవడానికి, వారి ప్రకంపనలను అనుభూతి చెందండి. మీరు ఉపరితలంపై చూసే వాటికి మాత్రమే ఆకర్షించబడవద్దు. వారిని మరింత లోతుగా తెలుసుకోండి, తద్వారా వారు మీతో చేరినప్పుడు మీరు వారితో మంచి ఫలవంతమైన సంబంధాన్ని కలిగి ఉంటారు.

 

  1. వైబ్రేషన్లు వ్యక్తుల సంరక్షణ, ప్రశాంతత, సహనం, సర్దుబాటు మరియు నేర్చుకోవడానికి సుముఖత వంటి లక్షణాలను వెల్లడిస్తాయి. సరైన ఆలోచన కలిగి ఉన్నవారు ఎవరైనా ఉద్యోగ నైపుణ్యాలలో కొంచెం బలహీనంగా ఉన్నా వారికి శిక్షణ ఇవ్వచ్చు. కానీ పాత్రకు అవసరమైన గుణాలు లేని, అత్యంత నైపుణ్యం కలిగిన, శారీరకంగా సమర్థులైన వ్యక్తులను నియమించుకోవడం తెలివైన పని కాదు.

 

  1. ధ్యానం మరియు ఆధ్యాత్మిక అధ్యయనంతో మీ అంతర్గత దృష్టిని సక్రియం చేయండి. మీరు నియమించాలనుకుంటున్న వ్యక్తుల వైబ్రేషన్లను మీ ఆంతరిక వివేకం అనుభూతి చెందుతుంది. ఆంతరిక దృష్టికి సరైనది ఏదో లేదా తప్పు ఏమిటో తెలుసు. ఇది వారి ఉద్దేశాలు, వైఖరి మరియు వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. కాబట్టి వ్యక్తులను ఎన్నుకోవడంలో భావోద్వేగపరంగా తెలివిగా ఉండండి మరియు వారు మీతో చేరినప్పుడు సానుకూల ఫలితాలను పొందండి.

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »