Hin

7th feb 2024 soul sustenance telugu

February 7, 2024

రోజువారీ జీవితంలో సమయ నిర్వహణ (పార్ట్ 1)

బిజీ జీవనశైలి మరియు సవాళ్లతో కూడిన సంబంధాల ప్రస్తుత ప్రపంచంలో పని ఒత్తిళ్లు మరియు డెడ్ లైన్స్ తో నిండిన జీవితాన్ని గడపడం కొన్నిసార్లు చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఒత్తిడి నుండి విముక్తి పొందేందుకు మరియు సామర్థ్యాన్ని అత్యధికంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి? కొత్త పనిని ప్రారంభించినప్పుడల్లా, కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

ఉదా. నేను నా ఆఫీసులో ప్రాజెక్ట్ లీడర్ అయితే, నా ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ పనులే కాకుండా అనేక ఇతర అంశాలను నేను విశ్లేషించాలి. మొదటి మరియు అతి ముఖ్యమైన అంశం సమయ ప్రణాళిక, అంటే ప్రాజెక్ట్‌లోని అన్ని విభిన్న అంశాలను నేను ఎలా విజయవంతంగా పూర్తి చేస్తానో నాకు తెలియాలి. నేను ఉన్న టైమ్ లో దీన్ని చేయాలి. సమయ ప్రణాళికలో చాలా ముఖ్యమైన అంశం నేను వీలైనంత తక్కువ ఆలోచనలతో ఉండడం. ఎందుకంటే నా మనసులో ఆలోచనలు ఎంత ఎక్కువైతే పనిపూర్తి చేయడానికి నాకు అంత ఎక్కువ సమయం పడుతుంది. మనస్సును సైలెంట్ చేయడానికి మెడిటేషన్ వంటి సహజమైన పద్ధతులను అభ్యసించడం ద్వారా పని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని అనుభవం చెప్తుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి అవుతుంది. ప్రతి గంట తర్వాత నా పనిని కాసేపు ఆపి, మనస్సు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అనేది మనస్సుకు విశ్రాంతినిచ్చే ఒక సహజ పద్ధతి. ట్రాఫిక్ కంట్రోల్ అంటే శాంతి, ప్రేమ, ఆనందం, విజయం మరియు విశ్వాసం వంటి విభిన్న లక్షణాల గురించి కొన్ని సానుకూల ఆలోచనలను రచించడం. మీరు దీన్ని ఒక నిమిషం పాటు చేసి, ఆపై పనిని కొనసాగించవచ్చు. ఇది మిమ్మల్ని దృష్టి సారించేలా   ఉంచుతూ రాబోయే ఒక గంట పాటు మానసికంగా ఛార్జ్ చేస్తుంది. ఇది ఒక మానసిక సూత్రం మరియు మనసు-శరీరాల సంబంధం. అభౌతికమైన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, భౌతిక శరీరం ద్వారా మనం చేసే చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాము.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »