Hin

9th feb 2024 soul sustenance telugu

February 9, 2024

రోజువారీ జీవితంలో సమయ నిర్వహణ (పార్ట్ 3)

సమయ నిర్వహణలో సహాయపడే సరైన ఆలోచనలను సృష్టించడమే కాకుండా, మంచి సమతుల్యత అవసరం. వివిధ చర్యలకు నా సమయం సరిగ్గా కేటాయించబడుతుందో లేదోనని నన్ను నేను చెక్ చేసుకోవాలి. ఈ చర్యలు మీ పని, మీ హాబీలు, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆరోగ్యం, మీ సంబంధాలు మరియు మీ జీవితంలోని అన్ని ఇతర రంగాలు కావచ్చు. చాలా సార్లు మనం విజయాన్ని తప్పుగా నిర్వచించుకుంటాము, బహుకాలంగా వస్తున్న తప్పుడు నమ్మకాలతో దాని వెంట పరుగెత్తుతాము. ఫలితంగా, మన సమయాన్ని తప్పు మార్గంలో వినియోగిస్తాం. కాబట్టి, నా సంబంధాలలో  అత్యంత ముఖ్యమైనవి ఏంటి అని పరిశీలించుకోవాలి. నేను నా పనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాను, ఎంత వరకు సమయం ఇస్తాను అని కూడా చెక్ చేసుకోవాలి. అలాగే, నా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యత సరిగ్గా ఉందా? నేను విజయం యొక్క సరైన నిర్వచనాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవన్నీ విశ్లేషించాలి. కేవలం భౌతిక విజయం మాత్రమే కాదు, సంతుష్ట మనస్సు మరియు హృదయం ఉండాలి. సంతృప్తి అనేది అంతర్గత విజయం, అది భౌతిక విజయం కంటే ముఖ్యమైనది. నేను నా ప్రాధాన్యతలను సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత, నా సమయం సరైన దిశలో, సరైన పద్ధతిలో ప్రవహిస్తుంది.

శాంతి, ప్రేమ మరియు సంతోషం వంటి నా అంతర్గత మనస్సు యొక్క సంపద రూపంలో నా ప్రతి చర్యలో నేను ఏమి పొందవచ్చో లేదా కోల్పోతానో కూడా నేను చెక్ చేయాలి. నేను విజయాన్వేషణలో నా పని ఆశయాల వెంట పరుగెత్తుతున్నాననుకుందాం, కానీ ఈ ప్రక్రియలో నేను నా సంబంధాలను, నా ఆరోగ్యాన్ని లేదా నా మనశ్శాంతిని నిర్లక్ష్యం చేస్తున్నానా? అలాగే, కొన్ని సంబంధాలు నాకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తూ ఉండవచ్చు కానీ అవి నన్ను భగవంతునితో నాకున్న సంబంధానికి దూరం చేస్తున్నాయా? అన్నింటికంటే, భగవంతునితో నా సంబంధం బలంగా ఉంటే, నా ఇతర సంబంధాలన్నీ విజయవంతమవుతాయి. వీటన్నింటికీ మరియు ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు నా జీవితంలో సమయాన్ని మంచిగా కేటాయించేలా చేస్తాయి,, దీనిని టైమ్ మేనేజ్‌మెంట్ అని కూడా పిలుస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »