Hin

13th May 2024 Soul Sustenance Telugu

May 13, 2024

రోజులోని ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చడం

సమయం చాలా ముఖ్యమైన అంశం అయిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము, సమయం చుట్టూ మన జీవితం తిరుగుతుంది. మనం ఉదయాన్నే లేచినప్పుటి నుండి విలువైనవి చేయడానికి, ప్రతి క్షణాన్ని విలువైనదిగా చేయడానికి జీవితం మనకు నిర్ణీత గంటలను ఇస్తుంది. రోజులోని ప్రతి క్షణంలో మనం అద్భుతాలు ఎలా సృష్టించగలం? 5 మార్గాలను అన్వేషిద్దాం –

 

  1. రోజులోని ప్రతి ఆలోచనను స్వచ్ఛంగా, సానుకూలంగా మరియు శక్తివంతంగా చేయండి – ఆలోచనలు మన వద్ద ఉన్న అతిపెద్ద సంపద, ఇది సమయాన్ని ముఖ్యమైనదిగా చేస్తుంది. ఎందుకంటే మనం ప్రతి ఆలోచనలో మంచి మరియు శక్తిని అనుభూతి చెందినపుడు, ఇతరులకు దాని అనుభవాన్ని అందించినప్పుడు, మనం సానుకూలత యొక్క అద్భుతాలను సృష్టిస్తాము. ఈ అద్భుతాలు  మన చర్యలు మరియు సంబంధాలలో కనిపించి అందరి జీవితాలను అందంగా మారుస్తాయి.
  2. ప్రతి క్షణాన్ని భగవంతుని ప్రేమతో మరియు సాన్నిహిత్యంతో నింపండి – మనం భగవంతుని అనుభూతి చెంది వారితో మాట్లాడినప్పుడు మన వైబ్రేషన్లు, మాటలు మరియు చర్యల ద్వారా ఇతరులకు కూడా అదే అనుభవాన్ని అందించినప్పుడు రోజులోని ప్రతి క్షణం సుందరంగా మారుతుంది. నిరంతర విజయానికి మరియు సంతోషానికి భగవంతుని అనుభూతి కలిగి ఉండటం చాలా ముఖ్యం.
  3. ఆత్మిక స్పృహ ద్వారా అద్భుతాలను సృష్టించడం – మనం రోజులోని ప్రతి క్షణాన్ని భౌతిక స్పృహలో గడిపినప్పుడు, మన అంతర్గత జీవి మరియు అంతర్గత ఉనికితో సంబంధాన్ని కోల్పోతాము. మనం ఉపరితలంపై జీవితాన్ని గడుపుతాము, దీని కారణంగా మన సమయం భౌతిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. మనం ఆత్మకు కావలిసిన పాలన ఇవ్వము. ఆత్మిక స్పృహ మనల్ని అంతర్గతంగా నింపుతుంది. తద్వారా అన్ని భౌతిక ప్రయోజనాలను సాధించడం సులభం చేస్తుంది.

 

  1. అందరి ముఖంలో శాంతి మరియు చిరునవ్వు తీసుకురావడం – ఇతరులకు మనం ప్రతిరోజూ చేయగలిగే అతి ముఖ్యమైన సేవ వారిని శాంతియుతంగా మరియు ఆనందంగా ఉంచడం. మనం కలిసే ప్రతి ఒక్కరితో మరియు మనకు దూరంగా ఉన్నప్పటికి సైన్స్ మాధ్యమాల ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్న వారికి కూడా శాంతిని, ఆనందాన్ని ఇస్తే ప్రతి క్షణం విలువైనదిగా మారుతుంది.
  2. సానుకూల చర్యలతో సానుకూల భాగ్యాన్ని తయారుచేసుకోవడం – రోజులో మనం చేసే ప్రతి పని ఆత్మ, పరమాత్మ మరియు కర్మల యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రభావితమైతే ప్రతి క్షణం ముఖ్యమైనదిగా మారుతుంది. ఇది స్వయానికి మరియు అందరికీ సానుకూల భాగ్యాన్ని కలిగిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

15th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది  నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన

Read More »
14th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా

Read More »
13th May 2025 Soul Sustenance Telugu

తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత

Read More »