Hin

8th Feb 2024 Soul Sustenance Telugu

February 8, 2024

రోజువారీ జీవితంలో సమయ నిర్వహణ (పార్ట్ 2)

మనం చాలా బిజీగా ఉన్నప్పుడల్లా, ఒకట్రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకొని మనతో మనం మాట్లాడుకోవాలి మరియు కొన్ని సానుకూల ఆలోచనలను ఇచ్చుకోవాలి.  ఈ విధంగా, మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. చర్యలను సానుకూలంగా నిర్వహించడానికి మనకు ఏకాగ్రమైన మనస్సు మరియు బుద్ధి అవసరం. ఉదా. ఒక నిర్దిష్ట సమయంలో, మీ శాంతి స్వరూపాన్ని లేదా ఆధ్యాత్మిక శక్తిని, అని మీకు మీరు చెప్పుకోండి. అలాగే, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ చూసినప్పుడు — నా శాంతి యొక్క శక్తి నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాపించి వారికి శాంతిని ఇస్తుంది, అనే ఆలోచనలను సృష్టించండి. అదే విధంగా, మీరు సంబంధాలలో ఒత్తిడితో ఉన్నట్లయితే – నేను మధుర స్వభావం గల ఆత్మ, నేను ఇతరుల నుండి ప్రేమను పొందకపోయినా అందరికీ ప్రేమను అందించాలి అని అనుకోండి. మీరు ఇలా కూడా సంకల్పం చేయవచ్చు – నేను నా ఇంటికి లేదా నా ఆఫీసుకు ప్రేమను ప్రసరింపజేస్తున్నాను,  దాని వాతావరణాన్ని మంచి భావాలు మరియు శుభాకాంక్షలతో నిండినదిగా మారుస్తున్నాను.

ఇది ప్రతి గంటకు ఒక నిమిషం పాటు చేయవచ్చు. నిన్నటి మెసేజ్‌లో వివరించినట్లుగా, మీకు ఏది అవసరమో దాని సంబంధిత ఆలోచనలను సృష్టించండి., ఈ ఆలోచనలు మీ కార్యాలయాన్ని, మరియు మీ ఇంటిని మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో అలా అనుభూతి చెందేలా చేస్తాయి. అలాగే, ముందు మీ మనస్సు కూడా మీరు కోరుకున్నట్లుగా అవుతుంది. మీ ఆలోచనలు మీ భావాలను మరియు వైఖరిని అనుగుణంగా ప్రభావితం చేస్తాయి. సంబంధాలు విజయవంతమవుతాయి, అందరూ మీతో మరింత సహకరించడం ప్రారంభిస్తారు. అలాగే, మీరు మీ మాటలు మరియు చర్యలతో అందరినీ మరింత సంతృప్తి పరచగలరు అని గుర్తుంచుకోండి

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

15th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది  నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన

Read More »
14th May 2025 Soul Sustenance Telugu

భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా

Read More »
13th May 2025 Soul Sustenance Telugu

తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత

Read More »