Hin

2nd jan 2024 soul sustenance telugu

January 2, 2024

సానుకూల ఆలోచనలతో సానుకూల ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి

మన శారీరక ఆరోగ్యంపై ఆలోచనల ప్రభావం చాలా ఉంటుంది. ప్రతి ఆలోచన శరీర కణాలపై ప్రభావం చూపుతుంది. నేడు పెద్ద సంఖ్యలో నిరంతర ప్రతికూల భావోద్వేగాలు అనగా ఒత్తిడి, కోపం, భయం, బాధ, అపనమ్మకం, అసూయ, అపరాధ భావం మానసిక వ్యాధుల రూపంలో బయట పడతాయి. ఇప్పుడు మనం ఆరోగ్యంపై సానుకూల భావాల ప్రభావంపై దృష్టి పెడదాము. ప్రేమ, శాంతి, ఆనందం, క్షమాభావం, అంగీకారం, ప్రశంసలు, నమ్మకం, ఉత్సాహం – ప్రతి శక్తివంతమైన మరియు సానుకూల ఆలోచన మన శరీరంలోని కణాలపై ప్రభావం చూపుతుంది. సరైన ఆలోచనా విధానం కేవలం మనం బాగా లేనప్పుడు మాత్రమే కాదు అన్ని సమయాలలోనూ కావాలి. గత బాధలు, ఆగ్రహం, క్షమించలేకపోవడం మరియు మరచిపోలేకపోవడం అనే మన భావోద్వేగ అవరోధాలు తొలగించుకుందాం. ఇది ఒక ఆలోచన అంత దూరం మాత్రమే ఉంది. పరిస్థితి చాలా కాలం క్రితం జరిగి ఉండవచ్చు, కానీ నేను ఈ రోజు కూడా ఆ భావోద్వేగానికి గురి అయినట్లైతే నేను భావోద్వేగ అవరోధాన్ని కలిగి ఉన్నట్టు, ఇది ఇప్పటికే నా శరీరంలో శక్తిని అవరోధం కలిగించి ఉంటుంది.

మనం ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు, కేవలం శారీరక అనారోగ్యాన్ని నయం చేయడంపై దృష్టి పెడతాము, కానీ అనారోగ్యానికి మూలమైన భావోద్వేగ అవరోధం తొలగించకపోతే, శారీరక అనారోగ్యం రిపీట్ అవుతుంది. ప్రతిసారి మనం కోపం బదులు కరుణను; పగ బదులు క్షమాపణ; సందేహం బదులు నమ్మకం; పోటీ బదులు సహకారం; విమర్శల బదులు ప్రశంసలు ఎంచుకుంటే మనం వ్యాధి కంటే ఆరోగ్యాన్ని ఎంచుకున్నట్టు. మన శరీరానికి సంబంధించి చేసే  ప్రతి ఆలోచన – అది మనం కనిపించే తీరు గురించి అయినా; మన ఆరోగ్యం గురించి; మనం వదులుకోవాలనుకునే వ్యసనం గురించైన సరే, ఆ ఆలోచనలు శరీరానికి ఒక సందేశం ఇస్తాయి, ఆ సందేశాన్ని శరీరం స్వీకరిస్తుంది. కాబట్టి, మనస్సుకు హాని కలిగించే వాటిని తొలగించి గత జ్ఞాపకాల బాధను తుడిచివేద్దాం, ఎందుకంటే మానసిక ఆరోగ్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »