Hin

సానుకూల సమాచారంతో సానుకూల భాగ్యాన్ని సృష్టించడం (పార్ట్ 1)

April 1, 2024

సానుకూల సమాచారంతో సానుకూల భాగ్యాన్ని సృష్టించడం (పార్ట్ 1)

ఈ సమాచార యుగంలో, మనం జ్ఞానంతో నిండిపోతున్నాము. మనం తీసుకుంటున్న సమాచారం యొక్క నాణ్యతను కాసేపు ఆగి చెక్ చేస్తున్నామా? మనం వినడంతో, చదవడంతో, చూస్తున్న వాటితో  నింపుకుంటున్న ప్రతిదీ మనకు వర్తిస్తుందా? ఆహారం మన శరీరానికి ముఖ్యం అలానే  సమాచారం మనస్సుకు ఆహారం. మనం వినియోగించే ప్రతి సమాచారం మన ఆలోచనలకు మూలం అవుతుంది. మన ప్రతి ఆలోచన వెనుక ఒక భావం ఉంటుంది. కాలానుగుణంగా వచ్చే భావాలు మన వైఖరిని ఏర్పరుస్తాయి. వైఖరి కర్మలలోకి

 వస్తుంది. పదే పదే చేసే ఏ పని అయినా అలవాటుగా అవుతుంది. మన అలవాట్లన్నీ కలిపితే మన వ్యక్తిత్వం.  మన వ్యక్తిత్వం శక్తిని ప్రసరింపజేస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎలాంటి శక్తిని ప్రసరిస్తామో అలాంటి శక్తినే పొందుతాము. అదే మన భాగ్యం అవుతుంది. ఈ అంతర్గత ప్రక్రియ గురించి తెలుసుకొని మన భాగ్యంపై మన ఆలోచనల ప్రభావాన్ని మరియు మన ఆలోచనలపై సమాచారం యొక్క ప్రభావాన్ని చూద్దాం. 

సాధారణ సూత్రం :   సమాచారం = వివేకయుక్తమైన సమాచారం.

మన జీవితంలోని సాధారణ దృశ్యాలను తీసుకొని మనం ఎలా స్పందిస్తామో చెక్ చేసుకుందాము – మీ బిడ్డ ఇంటికి చేరుకోలేదు మరియు ఫోన్ చేస్తే అందుబాటులో లేదు అని వస్తుంది … చింత, ప్రమాదం, ఆందోళనలతో కూడిన ఆలోచనలు సహజమేనా? మీరు ఒక అసైన్‌మెంట్‌పై చాలా కష్టపడి పని చేసారు మరియు దానికి ప్రతిఫలంగా మీరు విమర్శలను ఎదుర్కొంటారు … బాధ కలిగించే ఆలోచనలు సహజమేనా? ఎవరినైనా ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తించాలని మీరు ఆశించారు మరియు వారు అర్థం చేసుకున్నట్లు కూడా  కనిపించడం లేదు … చికాకు మరియు కోపం యొక్క ఆలోచనలు సహజంగా వస్తున్నాయా? ఒత్తిడి, కోపం, తిరస్కరణ, బాధ, అసూయ, పగ వంటి అసౌకర్య భావోద్వేగాలను సహజం అని అంటున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఈ భావోద్వేగాలు వరుసగా వస్తున్నాయంటే మనం చెదిరిన మనస్సు, వ్యాధిగ్రస్తమైన శరీరం మరియు వివాదాలు గల సంబంధాలను సృష్టిస్తున్నామని అర్థం.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »