Hin

2nd april 2024 soul sustenance telugu

April 2, 2024

సానుకూల సమాచారంతో సానుకూల భాగ్యాన్ని సృష్టించడం (పార్ట్ 2)

మనం శాంతి, ప్రేమ, సంతోషం, ఆరోగ్యం, సంపద మరియు సామరస్యం యొక్క భాగ్యాన్ని  కోరుకుంటాము. మన విధిని మార్చుకోవడానికి, మనం సరైన ఆలోచనలను సృష్టించాలి మరియు అది సహజాంగా జరిగేలా చేయడానికి, మనం స్వచ్ఛమైన సమాచారాన్ని వినియోగించాలి. మనం కాసేపు ఆగి ప్రతిరోజూ మనస్సుకు అందిస్తున్న సమాచార నాణ్యతను చెక్ చేసుకోవాలి. చాలా తరచుగా, భీభత్సం, హింస, ద్వేషం, అపహాస్యం, అపవిత్రత, అవకతవకలతో నిండిన సమాచారాన్ని మనకు మనం అందిస్తున్నాము … ఇది ఈ రోజు మన విధిని ప్రతిబింబిస్తోంది. తదుపరిసారి మనకు ఏదైనా సమాచారం వచ్చినప్పుడు, మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మరియు సామాజికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారమేనా అని చెక్ చేసుకోవాలి. కాకపోతే, మనకు సరికాని ఆహారాన్ని తినడానికి నిరాకరించినట్లుగా, మనం దానిని చదవకూడదు లేదా గ్రహించకూడదు. ప్రతికూల సమాచారాన్ని చదవడం మరియు స్నేహితులతో పంచుకోవడం ప్రతికూల శక్తిని ప్రసరించే లోతైన కర్మను సృష్టిస్తుంది మరియు ఈ సామూహిక శక్తి మన ప్రపంచాన్ని ఈనాటి ప్రపంచంలా చేస్తుంది.

పది నిమిషాల ఆరోగ్యకరమైన సమాచారంతో రోజును ప్రారంభిద్దాం. ఈ ప్రయాణంలో ఆధ్యాత్మిక సమాచారం మనకు స్నేహితునిగా ఉంటుంది. వివేకం మరియు లోతైన అంతర్దృష్టులతో నిండిన సమాచారం, ఇది మనస్సుకు శిక్షణనిస్తుంది, ప్రతి పరిస్థితిలో సరైన ఆలోచనలను సృష్టిస్తూ ప్రతిరోజూ అందమైన భాగ్యాన్ని ఎంచుకోవడానికి మనకు శక్తినిస్తుంది. ఒక సవాలును ఎదుర్కొంటున్నా లేదా కొంచెం గందరగోళంగా ఉన్నా … మన స్నేహితుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. కొంచెం ఆధ్యాత్మిక సమాచారాన్ని చదవండి, ప్రతి పదాన్ని చదువుతూ సవాలును గౌరవప్రదంగా అధిగమించడానికి మనస్సు బలపడుతుందని భావించండి.

మనం కోరుకున్న భాగ్యాన్ని సృష్టించడం … ఇది ఒక్క ఆలోచన మాత్రమే!

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th feb 2025 soul sustenance telugu

నిద్రపోయే ముందు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ నుండి దూరమవ్వండి 

రాత్రి వరకు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ లో చిక్కుకోవడం వల్ల మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు పనుల గురించి ఆలోచిస్తూ, మన నిద్రకు భంగం కలిగిస్తుంది. మన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అదుపు తప్పడం

Read More »
11th feb 2025 soul sustenance telugu

పునర్జన్మ అనేది వాస్తవమేనా ? 

మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి. 

Read More »
10th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 3)

మీ మంచితనాన్ని ఉపయోగించుకోండి లేదంటే కోల్పోతారు  వారి సానుకూల శక్తులను ఉన్నతొన్నతమైన మూలం లేదా భగవంతుడు నింపే వ్యక్తులకు ఇచ్చే వ్యక్తిత్వం సహజంగా వస్తుంది. లేకపోతే ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇతరులకు సేవ

Read More »