Hin

8th May 2025 Soul Sustenance Telugu

May 8, 2025

సానుకూల వర్తమానం మరియు భవిష్యత్తును సృష్టించడానికి 3 సూచనలు (పార్ట్ 2)

ప్రతి అడుగులోనూ మంచి చర్యలు తీసుకోండి

ఆధ్యాత్మిక జ్ఞానం మన జీవితంలోని ప్రతి రంగంలో శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండిన మంచి చర్యలను చేసే కళను బోధిస్తుంది. మనం గతంలో చేసిన ప్రతికూల చర్యల బరువును మన చైతన్యంలో ప్రతికూల సంస్కారాల రూపంలో మోస్తున్నామని మనందరికి తెలుసు. ఇది ఆ ప్రతికూల చర్యలు జరిగినప్పుడు ఆత్మలో సృష్టించబడింది. ఈ ప్రతికూల సంస్కారాలు మనం సంభాషించే వివిధ వ్యక్తులకు, ప్రకృతికి మరియు మనం తినే ఆహారం, మనం తాగే నీటికి ప్రతికూల వైబ్రేషన్లను ప్రసరింపజేస్తాయి. మనం అటువంటి వస్తువులను వినియోగించినప్పుడు, ఆ శక్తితో నిండిన వస్తువుల సంపర్కంలోకి వచ్చినప్పుడు, లేదా మన నుండి వచ్చే ప్రతికూల శక్తిని అనుభవించే వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులను సృష్టించుకుంటాము.

కాబట్టి, ఈ ప్రభావాన్ని తగ్గించడానికి, మనం సానుకూల చర్యలు మాత్రమే చేసేలా చూసుకోవాలి, మంచి మరియు దయగల మాటలు మాట్లాడాలి. ఎల్లప్పుడూ శాంతియుతమైన, ప్రేమగల ఆలోచనలను సృష్టించాలి. ఎందుకంటే ఇది మన స్మృతిలో సానుకూలమైన తీపి వైబ్రేషన్లను సృష్టిస్తుంది. ప్రతిదానికీ మరియు మనం సంభాషించే ప్రతి ఒక్కరికీ అదే మంచితనంతో నిండిన శక్తిని ప్రసరింపజేస్తుంది, ఇది జీవితంలో అందమైన మరియు ప్రయోజనకరమైన దృశ్యాల సృష్టికి దారితీస్తుంది.

కొన్నిసార్లు గతంలోని ఒక ప్రతికూల చర్య యొక్క ప్రభావం ఎంత శక్తివంతంగా ఉంటుందంటే అది ప్రస్తుతంలోని అనేక సానుకూల మరియు మంచి చర్యల ప్రభావాన్ని తగ్గించగలదు. కాబట్టి, మనం ప్రస్తుతం సానుకూల చర్యలు మాత్రమే చేసేలా జాగ్రత్తగా ఉండాలి మరియు ప్రతికూల చర్యలు అస్సలు ఉండకూడదు. అప్పుడు, నెమ్మదిగా మన సానుకూల చర్యలు మనపై గతంలోని ప్రతికూల చర్యల ప్రభావాన్ని తగ్గించడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు ఈ పని చాలా కష్టమని మనకు అనిపించవచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గం ఆత్మిక స్మృతి మరియు భగవంతుని స్మృతిలో అన్ని చర్యలను ఎలా చేయాలో నేర్పుతుంది. ఇది ఆత్మను లోతైన, మరింత శాశ్వత గుణాలు మరియు శక్తులతో నింపుతూ మన చర్యలను చాలా శక్తివంతం చేస్తుంది. ఆ చర్యలు ఈ జన్మ మరియు మునుపటి జన్మల యొక్క ప్రతికూల గత చర్యల ప్రభావాన్ని తగ్గించే సామర్థ్యంతో వాటిని నింపుతుంది. అలాగే, ఈ ప్రక్రియలో భగవంతుడు ప్రతి అడుగులోనూ మనకు మార్గనిర్దేశం చేస్తారు. మనం ఆలోచించే మరియు భావించే దానికంటే సులభతరం చేస్తారు.

(సశేషం…)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »