Hin

9th May 2025 Soul Sustenance Telugu

May 9, 2025

సానుకూల వర్తమానం మరియు భవిష్యత్తును సృష్టించడానికి 3 సూచనలు (పార్ట్ 3)

గత ప్రతికూల చర్యల ప్రభావాన్ని తొలగించండి

మన వర్తమానాన్ని మరియు భవిష్యత్తును సానుకూలంగా సృష్టించే ఆధ్యాత్మికతలో ఒక అత్యంత ముఖ్యమైన దశ అంటే, ఆత్మలో ఉన్న గత పాపాలను లేదా ప్రతికూల చర్యలను శుద్ధి చేయడం. ఇవి మన వర్తమాన జీవితంలో అడ్డంకులుగా నిలుస్తాయి మరియు సానుకూల వర్తమానాన్ని మరియు భవిష్యత్తును సృష్టించడాన్ని నిరోధిస్తాయి. ధ్యానం అనేది భగవంతునితో లేదా పరమాత్మతో ఉన్న లోతైన సంబంధాన్ని ఆధారంగా చేసుకుని జరిగే సంభాషణ, ఐక్యం మరియు వైబ్రేషన్ల అనుసంధానం. ఈ అనుసంధానంలో, మనలో ఆధ్యాత్మిక శక్తి యొక్క అందమైన ప్రవాహంలా భగవంతుని వైబ్రేషన్లను మనం గ్రహిస్తాము. ఈ ప్రవాహం ఆత్మకు ఔషధం లాంటిది. ఇది గత పాపాల ప్రభావాలను శుభ్రపరుస్తుంది, ఆత్మకు మంచి వైబ్రేషన్లను ఇస్తూ దానిని సానుకూలమైన స్వచ్ఛత మరియు శక్తితో నింపుతుంది. ఆత్మ స్వచ్ఛత మరియు శక్తి యొక్క ఈ మంచి వైబ్రేషన్లను ప్రసరింపచేయడం ప్రారంభించినప్పుడు అది జీవితంలో మంచి పరిస్థితులను మరియు దృశ్యాలను ఆకర్షించడం ప్రారంభించి తక్కువ వ్యవధిలో దాని భాగ్యం తయారవుతుంది.

ఈ అనుసంధానం చేసేటప్పుడు మనం ఏ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి? ముందుగా, భగవంతుడు ఎవరో, వారిది మరియు మన ఆధ్యాత్మిక గుర్తింపు గురించి మనకు జ్ఞానం ఉండాలి. ఆ తరువాత మనం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఈ కనెక్షన్ను సరైన రీతిలో చేసే అలవాటును పెంపొందించుకోవాలి. ఎందుకంటే మనం సరైన టెక్నిక్ తో సంబంధాన్ని జోడించకపోతే, మన పాపాలు అంతం కావు మరియు మనం స్వచ్ఛంగా అవ్వలేము. మనపై మరియు మన జీవిత నాణ్యతపై ఈ పాపాల ప్రభావం నుండి విముక్తి పొందలేము. ధ్యాన సాధన కోసం, మన ఇంటిలో మంచి, పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లు మరియు ఇతర జీవనశైలిని అలవర్చుకొని సరైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. అలాగే, ప్రతి రోజు ధ్యానం చేసేందుకు ఒక చిన్న ధ్యాన స్థలాన్ని ఇంటిలో ఏర్పాటుచేసుకోవాలి. ధ్యానం కళ్ళు తెరిచి చేయాలి, తద్వారా అప్రమత్తత ఉంటుంది మరియు ఇలా చేయడం ద్వారా మీరు ఆత్మను, పరమాత్మను మరియు పరంధామాన్ని మీ అంతర్గత నేత్రంతో స్పష్టంగా చూడగలుగుతారు. చివరగా, మీరు 4 విధాలుగా ధ్యానాన్ని అభ్యసించవచ్చు – మౌనంగా లేదా బ్యాక్గ్రౌండ్ లో ధ్యాన మ్యూజిక్ తో. మన మునుపటి సందేశాలలో ధ్యానంలో ఏ ఆలోచనలను సృష్టించాలో, దేనిని విజువలైజ్ చేయాలో పంచుకున్నాము. ధ్యానం కోసం బ్రహ్మకుమారీస్ గైడ్ చేసిన కామెంటరీ లేదా ఆధ్యాత్మిక పాటనైనా ఉపయోగిస్తూ ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి మీరు వినే పదాలను అనుభవం చేసుకోవచ్చు.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »