Hin

29th may 2024 soul sustenance telugu

May 29, 2024

సదా సంతోషంగా ఉండే స్వభావాన్ని తయారుచేసుకోవటం

జీవితం యొక్క అత్యంత ముఖ్యమైన గుణాలలో సంతోషం ఒకటి. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వారి జీవితంలో ఏ క్షణంలోనైనా ఎవరూ తమ సంతోషాన్ని కోల్పోకూడదని అనుకుంటారు. మానవ జీవితంలో సంతోషంగా ఉండటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. ఇది మానవులందరిలో అత్యంత ప్రాధాన్యత కలిగినది. కానీ అదే సమయంలో సంతోషం శాశ్వతం కాదని, అది చాలా త్వరగా వచ్చి పోతుందని అందరూ భావిస్తారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలోని చాలా మంది యొక్క సంతోషానికి మూలం బాహ్యమైన దానిపై ఉంది. మన ప్రస్తుత జీవితంలో ఈ బాహ్య మూలాలు హెచ్చు తగ్గులవుతూ మారుతూనే ఉంటాయి. ప్రపంచంలోని కొందరు వ్యక్తులు సంతోషమంటేనే ఇలా అస్థిరంగా మరియు తాత్కాలికంగా ఉండేటటువంటిదని భావిస్తారు. ఇంకా, ప్రపంచంలో సదా సంతోషంగా ఉన్న సమయం అంటూ ఏది లేదని భావిస్తారు. కానీ అది నిజం కాదు ఎందుకంటే భగవంతుడు ఆనంద సాగరుడు. వారి వైబ్రేషన్లు, మాటలు మరియు చర్యలతో సృష్టించబడిన అసలైన ప్రపంచం ఏ రకమైన దుఃఖం లేకుండా ఆనందంతో నిండి ఉంటుంది.

కాబట్టి, మనం మొదట జీవించిన ఆనంద ప్రపంచంలోని మన అసలు సంస్కారాలు నిరంతర సంతోషాన్ని కలిగి ఉన్నాయని, తాత్కాలికమైనవి కాదని చివరికి మనం గ్రహించాలి. మనం గ్రహించవలసిన మరో విషయం ఏమిటంటే, ఆనంద ప్రపంచంలోని బాహ్యమైన ప్రతిదీ స్వచ్ఛమైనది, పరిపూర్ణమైనది అయినప్పటికీ, మన సంతోషం బయట దేనిపై కాకుండా మన అంతర్గత ఆత్మ సాఫల్యంపై ఆధారపడి ఉండేది. మనం బయట ఉన్న ప్రతిదానిని అంటే మన శారీరక సౌందర్యం, మన సంబంధాలు, మన పాత్రలు, మన పరిపూర్ణ ఆరోగ్యం, మన అపారమైన సంపద మరియు బాహ్యంగా మనకు అందించిన ప్రకృతి యొక్క అందమైన బహుమతులను ప్రేమించాము మరియు ఆనందించాము. కానీ అదే సమయంలో మన సంతోషం వాటిపై ఆధారపడి ఉండేది కాదు. ఇప్పుడు మనల్ని మనం నింపుకోవాల్సినవీ అవే సంస్కారాలు – మన వెలుపల ఏమి జరిగినా బేషరతుగా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం, మరికొన్ని సంవత్సరాల పరివర్తన తర్వాత, నిరంతర సంతోషం యొక్క దశలోకి ప్రవేశిస్తుంది. దానిని భగవంతుడు మళ్లీ సృష్టిస్తున్నారు. అందులో మనం భాగం అవుతాము. మన ప్రస్తుత సంస్కారాలను భవిష్యత్తులోకి తీసుకువెళతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th feb 2025 soul sustenance telugu

పునర్జన్మ అనేది వాస్తవమేనా ? 

మనమందరం ఆధ్యాత్మిక జీవులం లేదా ఆత్మలం, మన శరీరాల ద్వారా మన పాత్రలను పోషిస్తున్నాము. మన స్వభావం లేదా సంస్కారాల ఆధారంగా మన ఆధ్యాత్మిక ఆలోచనలు, మనం విజువలైజ్ చేసేది, ప్రవర్తించేది వేర్వేరుగా ఉంటాయి. 

Read More »
10th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 3)

మీ మంచితనాన్ని ఉపయోగించుకోండి లేదంటే కోల్పోతారు  వారి సానుకూల శక్తులను ఉన్నతొన్నతమైన మూలం లేదా భగవంతుడు నింపే వ్యక్తులకు ఇచ్చే వ్యక్తిత్వం సహజంగా వస్తుంది. లేకపోతే ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. ఇతరులకు సేవ

Read More »
9th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 2)

సానుకూల శక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు వ్యక్తులు మన జీవితాల్లోకి వేర్వేరు, కొన్నిసార్లు వ్యతిరేక సంస్కారాలతో కూడా వస్తారు. తరచుగా, మన ప్రియమైనవారిలో అలాంటి వ్యక్తులు కనిపిస్తారు – భర్త లేదా భార్య, తల్లిదండ్రులు, పిల్లలు

Read More »