Hin

29th Feb 2024 Soul Sustenance Telugu

February 29, 2024

సదా సంతోషంగా ఉండేందుకు 5 చిట్కాలు

  1. ప్రపంచం నా పట్ల ప్రతికూలంగా మారుతున్నప్పటికీ, నేను ఎల్లప్పుడూ నా మనస్సులో ఒక మంచి ఆధ్యాత్మిక జ్ఞాన పాయింట్ ను గుర్తుంచుకుంటాను. దాని లోతును అనుభవం చేసుకుంటూ నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులకు ప్రభావితం కాకుండా సంతోషం, శక్తితో నిండి ఉంటానని ప్రతిరోజూ వాగ్దానం చేయండి.

 

  1. నేను చాలా విశేషతలతో నిండిన, భగవంతునితో సహా అందరిచే ప్రేమించబడిన అందమైన ఆత్మను అనే దీవెన నాకు నేను ఇచ్చుకోగలిగే అత్యంత ఉత్తమమైన కానుక. నా మాటల్లో, చేతల్లో నా ప్రత్యేకతలను తీసుకురావాలి మరియు ఇతరులకు నా ప్రత్యేకతల వెలుగును ప్రసరింపజేయాలి. సంతోషం మరియు సంతుష్టతకు ఇది కీలకం.

 

  1. నేను జీవితంలో ఎంత ఎక్కువ పురోగమిస్తూ ఉంటానొ, నా జీవితంలోని అన్ని రంగాలలో అనేక సవాళ్లు ఉంటాయి – మనస్సు, శరీరం, సంబంధాలు మరియు పాత్ర. సదా సంతోషంగా ఉండటానికి జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఒక గుణాన్ని లేదా ఒక శక్తిని ఉపయోగించండి. మన  సానుకూల మరియు సంతోషకరమైన ప్రకాశం ప్రతికూల పరిస్థితులను ప్రభావితం చేసి వాటిని సానుకూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది.

 

  1. జీవితంలో నా అత్యంత అందమైన మరియు నిరంతర సహచరులు నేను మరియు భగవంతుడు. నేను వారితో ఎంతగా కనెక్ట్ అవుతానో, అడుగడుగునా వారిని నా బెస్ట్ ఫ్రెండ్స్‌గా చేసుకుంటానో, నాలో అంత సంతోషం కలుగుతుంది. నా ముఖం మరియు ఆధ్యాత్మిక వ్యక్తిత్వం నా ఇల్లు మరియు కార్యాలయంలో, నేను వెళ్ళే ప్రతిచోటా సంతోషాన్ని ప్రసరింపజేస్తాయి.

 

  1. నేను రోజును ప్రారంభించినప్పుడు, ఉదయమే ఆ రోజంతా, నేను ఇతరుల సుగుణాలను చూస్తాను, వారి బలహీనతలను చూడను అని నాకు నేను గుర్తు చేసుకుంటాను. ఇతరుల గురించి ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తానో, మాట్లాడుతానో అంతగా అందరి మన్ననలు పొంది సంతోషాన్ని, తేలికతనాన్ని అనుభవం చేసుకుంటాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

21st June 2025 Soul Sustenance Telugu

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రశంసలు మన అహంభావాన్ని పెంచితే, విమర్శించినప్పుడు మనం ఖచ్చితంగా కలత చెందుతాము. ప్రశంసలు లేదా విమర్శల వల్ల ప్రభావితం కాకుండా మనం

Read More »
20th June 2025 Soul Sustenance Telugu

బేషరతు ప్రేమలోని చక్కదనం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అందరినీ బేషరతుగా ప్రేమించాలనే అనుకుంటాం, కానీ ఎదుటివారి నుండి కోపం, అహం లేక ద్వేషం వస్తే, అప్పుడు కూడా వారితో

Read More »
19th June 2025 Soul Sustenance Telugu

నేను ప్రయత్నిస్తాను అని కాదు నేను తప్పకుండా చేస్తాను అని అనండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, నేను చేస్తాను అనే బదులుగా నేను ప్రయత్నిస్తాను అని అంటాము. ప్రయత్నించడం వేరు,  చేయడం వేరు. ప్రయత్నం అనే

Read More »