Hin

9th dec 2024 soul sustenance telugu

December 9, 2024

సదా సంతృప్తిగా ఎలా ఉండాలి?

సంతృప్తి అంటే విషయాలు భిన్నంగా ఉన్నాయని అనుకోవటం కంటే, మనం ఎవరమానేదాన్ని  మరియు మన వద్ద ఉన్నదాన్ని మెచ్చుకోవడం.

  1. లక్ష్యాలను సాధించి, సౌకర్యవంతమైన జీవితాలను గడుపుతూ, ప్రతిదానిలో విజయం సాధించినప్పటికీ సంతృప్తి చెందని వ్యక్తులను మీరు చూశారా? ఎక్కువ సాధించకపోయినా జీవితంలో పూర్తిగా సంతృప్తిగా ఉన్న వ్యక్తిని కూడా మీరు కలుసుకున్నారా? మీ సొంత జీవితంతో మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు?
  2. మీ సంతృప్తి మీ విజయాలపై ఆధారపడి ఉండదు. సంతృప్తి అనేది మీరు ఎలా ఆలోచిస్తారనే దానిలో, విజయం అనేది మీరు చేసే పనిలో ఉంటుంది. సంతృప్తి అనేది మెరుగు పడేందుకు కృషి చేస్తూ ప్రస్తుతం ప్రతిదానితో సంతోషంగా ఉండటమనే ఒక మంచి లక్షణం. బాహ్య పరిస్థితులు, వ్యక్తులతో సంబంధం లేకుండా సంతృప్తి చెందాలి.
  3. సంతృప్తి చెందడం అంటే మీరు సోమరితనంతో ఉంటూ, సాధించడం మానేయటం లేదా మీ వద్ద ఉన్నదానితో స్థిరపడాలని కాదు. మీరు ఎవరో, మీకు, మీ చుట్టూ ఉన్నవారికి, మీతో ఉన్న వ్యక్తులకు ఈ క్షణం జరుగుతున్న దానిలో సంతోషాన్ని అనుభవం చేసుకోవటమని మాత్రమే దీని అర్థం. ప్రతిదీ బాగానే ఉందని అంగీకరిస్తూ మరిన్ని విషయాలపై మరింత కృషి చేయడానికి సిద్ధంగా ఉండటం.
  4. సంతృప్తిని అనుభవం చేసుకోవటానికి ప్రతి ఉదయం జాగ్రత్తగా ఆలోచిస్తూ మీ మనస్సులో ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది మీ అంతరాత్మ నిండుగా ఉన్న భావం. సంతృప్తి యొక్క శక్తి ఇప్పటికే మీలో ఉంది. అసంతోషం లేదా అసంతృప్తి ఆలోచనలను సృష్టించడంలో మీ శక్తిని వృధా చేస్తూ మీరు దానిని క్షీణింప చేయకుండా చూసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »