Hin

6th April 2025 Soul Sustenance Telugu

April 6, 2025

సద్గుణశీలమైన శిశువుగా రూపుదిద్దడానికి తల్లిలో ఉండాల్సిన 5 గుణాలు

  1. స్వచ్ఛమైన ప్రేమకు మూలం – ఒక మంచి తల్లి తన బిడ్డ పట్ల స్వచ్ఛమైన ప్రేమకు మూలం. బిడ్డ తన గర్భంలో ఉన్నప్పటి నుండి బిడ్డను పోషించేది ఆమె ప్రేమ. ఆ ప్రేమే పిల్లల ప్రత్యేకతలు, గుణాలు మరియు శక్తులన్నింటినీ ముందుకు తీస్తుంది, బిడ్డను ప్రపంచంలో ప్రత్యేకమైనదిగా చేస్తుంది.

 

  1. సమృద్ధిగా ఉన్న వ్యక్తిత్వం – సానుకూల విషయాలను చూస్తూ, చదవుతూ మరియు వింటూ వివిధ మాధ్యమాల నుండి ప్రతికూల సమాచారానికి దూరంగా ఉండటం ద్వారా మంచి సమాచారంతో తనను తాను నింపుకున్నప్పుడు తల్లి వ్యక్తిత్వంలో గుణాలు మరియు శక్తుల సమృద్ధి వస్తుంది. ఆమె సమృద్ధి నిరంతరం బిడ్డకు ప్రవహిస్తూ, అతన్ని ఒక మంచి  సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.

 

  1. భగవంతునితో ఒక మంచి సంబంధం – తల్లికి బిడ్డ భగవంతుడిచ్చిన అమూల్యమైన బహుమతి, భగవంతుని ఒక ఏంజెల్. బిడ్డ భగవంతుడిచ్చిన వరమనే లోతైన భావనతో, అతడిని శ్రద్ధగా చూసుకోవటం తల్లి బాధ్యత. అలాగే, బిడ్డ పెరుగుదల సమయంలో భగవంతుడితో ఉన్న అందమైన అనుబంధం ద్వారా బిడ్డను భగవంతుని స్వరూపంగా తీర్చిదిద్దడం కూడా ఆమె కర్తవ్యమే.

 

  1. జ్ఞానానికి నిలయస్థంభం – బిడ్డను ఎలా పెంచాలి, బిడ్డను ప్రతి ఒక్కరూ ప్రేమించే మరియు గౌరవించే అందమైన వ్యక్తిగా ఎలా మార్చాలి అనే తల్లి జ్ఞానం పిల్లల మొత్తం వ్యక్తిత్వ అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. తల్లి జ్ఞానమే బిడ్డకు మార్గదర్శకంగా నిలిచి, అతన్ని పరిపక్వంగా తీర్చిదిద్దడంతో పాటు, సమాజానికి ఉపకారం చేసే వ్యక్తిగా మారుస్తుంది.


5. సానుకూలత మరియు స్వచ్ఛతతో నిండి ఉంటుంది – తల్లి సానుకూల ఆలోచనలు నిరంతరం బిడ్డను పోషించడంతో పాటు, అతని మనసును సానుకూలతతో నింపుతాయి. ఆమె స్వచ్ఛమైన ఆహార పానీయాల అలవాట్లు, నిత్యజీవన అలవాట్లు బిడ్డపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. పరిపూర్ణ తల్లి అంటే, సానుకూలత మరియు స్వచ్ఛతలో పరిపూర్ణమైనవారే.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »