Hin

30th june 2025 soul sustenance telugu

June 30, 2025

సమస్యను కాదు సమాధానాన్ని చూడండి

పరిస్థితి మీకు అనుగుణంగా లేకపోతే దానిని మీరు సమస్య, సంక్షోభం, గందరగోళం లేదా దురదృష్టం అని లేబుల్ చేస్తున్నారా? నిజానికి, అది కేవలం జీవితంలోని ఒక దృశ్యం మాత్రమే, అది ఎలా జరగాలని ఉందో అలాగే జరిగింది. మీ అంచనాలకు తగినట్లుగా జరగకపోతే దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే దానిని దాటుకుని వెళ్ళే ఆంతరిక శక్తని మీరు కోల్పోతారు. ఏ పరిస్థితి అయినా నిజానికి సమస్య కాదు, మనం చూసే దృష్టికోణమే దానిని సమస్యగా మారుస్తుంది. మన మనసుతో దానిని ఎంత పెద్దగా చూస్తామో అది అంత పెద్దగా కనిపిస్తుంది. నిందిస్తూ, నిర్ణయిస్తూ, ప్రశ్నిస్తూ, మన కంట్రోల్‌లో లేని పరిస్థితిని కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం చేస్తూ మనం తరచూ నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తూ ఉంటాం. జరిగిన దానిని మనస్ఫూర్తిగా అంగీకరించడం వలన మనసు నిదానిస్తుంది. మన సమర్థత మరియు నిర్ణయ శక్తి పెరుగుతాయి. ప్రశాంతమైన మనసు పరిష్కారాలను మరియు నూతన అవకాశాలను చూడగలుగుతుంది. మనసులోని ప్రశాంతత పరిస్థితిని ప్రభావితం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మన అదుపులో ఉన్న విషయంపై మనం శ్రద్ధ వహిద్దాం – మన స్పందన. ఇటువంటి స్థితిలో సమస్యకు పరిష్కారాన్ని తీసుకురండి. ఒకవేళ ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఆ నిజాన్ని హుందాగా అంగీకరించండి. బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా నేను నా మానసిక స్థితికి బాధ్యత వహిస్తాను, నేను నా మనసుకు మరియు పరిస్థితులకు యజమానిని అని గుర్తు చేసుకుంటూ ఉండండి. 

మన చిన్ననాటి నుండి, అనేక సంవత్సరాలుగా మనం ఎన్నో సాధించాము. వాటిని చూసుకుని మనకు గర్వంగా కూడా ఉంటుంది. వాటిని సాధించే సమయంలో మనం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉండవచ్చు. ఇబ్బందులు, ఆటంకాలు లేక భేదాలు వచ్చి ఉండవచ్చు. వాటిని దాటిన ఆ సమయాలను గుర్తు తెచ్చుకోండి. సవాళ్ళకన్నా సమాధానంపై శ్రద్ధ పెట్టినప్పుడల్లా మంచి ఫలితాలు పొందినట్లు మీకు అర్థమవుతుంది. కనుక సమస్య ఆరోగ్యమైనా, బంధాలైనా, ప్రాజెక్టు అయినా, ఆర్థిక విషయాలైనాగానీ, పరిష్కారం-ఆధారిత విధానాన్ని పెంపొందించుకోండి. సవాళ్ళ సమయమలో ఆలస్యం చేయడం, తప్పించుకోవడం చేయకండి. సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా మీరు మీ కలలను గమ్యాలుగా, గమ్యాలను వాస్తవాలుగా మార్చుకుంటారు. మీలోని పరిష్కారం-ఆధారత విధానంతో, దారిలో వచ్చే ప్రతీ విషయాన్నీ మీరు చక్కబెట్టగలరు.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »