Hin

9th April 2025 Soul Sustenance Telugu

April 9, 2025

సమయంతో శాంతిగా ఉండటం నేర్చుకోవడం (పార్ట్ 1)

కాలంతో మన సంబంధం

మనలో ప్రతి ఒక్కరూ భావోద్వేగ స్వేచ్ఛ లేదా మనతో మనం హాయిగా మరియు చుట్టూ ఉన్న ప్రతిదానితో సంతృప్తిగా ఉండే ప్రశాంతమైన మానసిక స్థితిని కోరుకుంటారు. అలాంటి క్షణాలను ఖచ్చితంగా రుచి చూసిన తరువాత, అవి ఎంత సంతృప్తికరంగా మరియు ఓదార్పునిస్తాయో మనందరికీ తెలుసు. కానీ మనం వాటిని నిలబెట్టుకోలేకపోతున్నాం. గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అనే మూడు కాలాలతో మనం ఎలా వ్యవహరిస్తాము అనే దానిపై మన జీవన నాణ్యత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, సమయాన్ని మనం అదుపులో ఉంచుకుంటామా లేదా దాని ప్రభావితులుగా మారతామా అనే విషయం, మన మనసును సమయంలోని ఏ కాలానికి కేంద్రీకరించాము లేదా దానికి మన భావోద్వేగ శక్తిని ఎంత ఇస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత క్షణమే మనకు ఉన్నదంతా, కాబట్టి దీన్ని ప్రతిఫలంగా ఉపయోగించుకోవాలి. కానీ మన మనస్సు ఎక్కువసేపు వర్తమానంలో ఉండదు. ఇది గతంలోని దృశ్యాలలోకి జారిపోతుంది లేదా భవిష్యత్తుపై ఊహలను సృష్టిస్తూ ఉంటుంది. గత జ్ఞాపకాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు అవసరమైనవే, కానీ వాటిలో పూర్తిగా నిమగ్నమై, ప్రస్తుతం జీవించడం మర్చిపోవడం సరైనది కాదు. ఇది జీవితంలోని ఏ రంగంలోనూ మంచి విజయాలను అందించదు.

 

గతాన్ని ఆలోచించడం అంటే మనకు అధికారం లేని దృశ్యాలను తిరిగి నిర్మించడం. అవి కేవలం మన జ్ఞాపకాలలోనే జీవిస్తాయి. ఒక గతస్మృతి ప్రేరేపించబడినప్పుడు, దానికి సంబంధించిన అనేక భావోద్వేగాల సమాహారం కూడా ప్రేరేపించబడుతుంది. అంతేకాక, ఒక జ్ఞాపకాన్ని ఆలోచిస్తుండగా, మరోటి, దాని తరువాత ఇంకొకటి మెదడులోకి వచ్చి, మనం నిరంతరంగా గత జ్ఞాపకాల ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, భావోద్వేగ గందరగోళాన్ని అనుభవించి, మన సమయం మరియు శక్తిని వృథా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతాము –  ఎందుకో ఎంతో అసౌకర్యంగా అనిపిస్తోంది? నేను ఇక్కడ కూర్చొని ఏమీ చేయకుండా ఉన్నా, నా మనసు మాత్రం గతంలో చిక్కుకుపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటే మన మనస్సు యొక్క తెరపై, మనకు ఏమి కావాలో లేదా మనం ఏమి ఆశిస్తున్నామో ఆ దృశ్యాన్ని చిత్రించడం. ఆ దృశ్యం నిజమవుతుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ మనసు ఇప్పుడు ఈ దృశ్యాలన్నింటి భారాన్ని మోస్తోంది, అందువల్ల దాని శక్తి క్షీణించిపోతుంది. గతం లేదా భవిష్యత్తుతో నిండిపోయిన మనస్సు, వర్తమానాన్ని నాశనం చేస్తుంది. అలసిపోయి, ఆందోళన లేదా బాధలో ఉన్నప్పుడు, మనసు ఎక్కువగా బలహీనంగా మరియు అస్థిరంగా మారుతుంది. మనకు కనిపిస్తున్నట్లుగా, సమయం వాస్తవానికి మనకు హాని చేయదు. మనసే గతం మరియు భవిష్యత్తుకు బంధించుకొని తన బాధను తానే సృష్టించుకుంటుంది. అప్పుడు మనం కాలానికి బానిసలుగా మారిపోతాం.

తదుపరి సందేశంలో, కాలాన్ని ఎలా అధిగమించాలో అన్వేషిద్దాం.

(సశేషం…)

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »