Hin

3rd jan 2024 soul sustenance telugu

January 3, 2024

సంబంధాలలో దృఢంగా ఉండటానికి 5 మార్గాలు

  1. మీరు చెప్పాల్సింది శాంతిగా, గౌరవప్రదంగా చెప్పండి- ఇతరులు మనతో ఏకీభవించనప్పుడు, మన అభిప్రాయాన్ని గౌరవించనప్పుడు మనకు కోపం వస్తుంది. అది తప్పు అని భావించి దాని గురించి ఏదైనా చేయాలనుకుంటాము. కనుక ఎటువంటి అహం లేకుండా శాంతి మరియు గౌరవంతో మనం అభిప్రాయాన్ని పంచుకొని, మనం చెప్పేది ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుందో కూడా వివరించవచ్చు.
  2. ఎదుటివారి భావాలు దెబ్బతినకుండా చూసుకోండి – దూకుడుగా ఉండటం మానవ సంబంధాలకు హానికరం అని మరియు అవతలి వ్యక్తికి బాధ కలిగించకుండా వారి భావాలను కించపరచకుండా సరైన మార్గంలో ఉపయోగిస్తే దృఢంగా ఉండటం తప్పు కాదని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. కాబట్టి, అవసరమైన చోట దృఢంగా ఉండి పరిస్థితులను విజయం వైపుకు తీసుకెళ్లవచ్చు.
  3. మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి సమయాన్ని వెచ్చించండి, జడ్జిమెంటల్‌గా ఉండకండి – మీరు మాట్లాడే ముందు ఆలోచించడం అనేది సంబంధాల యొక్క చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక కోణం ఎందుకంటే ఒకసారి మాట్లాడిన పదాలు తిరిగి రావు మరియు అవతలి వ్యక్తి వాటిని విన్న తర్వాత వారు వాటిని మరచిపోరు. కాబట్టి దృఢంగా ఉండటం మంచిదే కానీ మనం అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు మరియు దానిని సానుకూల మార్గంలో సంభాషణలలో భాగం చేయకూడదు.
  4. మీ దృఢస్వభావంలో భగవంతుని ప్రేమను భాగంగా చేసుకోండి – దృఢత భగవంతుని ప్రేమ మరియు మంచితనంతో నిండి ఉంటేనే ప్రభావవంతంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి. భగవంతుని ప్రేమ మనలో ఇతర వ్యక్తుల పట్ల ఆధ్యాత్మిక ప్రేమను నింపి, వారి పై మరింత శ్రద్ధ చూపేలా చూస్తుంది. కనుకనే ఇదే  దృఢంగా ఉండటంలో చాలా ముఖ్యమైనది. అలాగే, మన హృదయంలో ఉన్న ప్రేమ మనం దృఢంగా ఉన్నప్పుడు కరకుగా ఉన్నవారిగా కాకుండా చాలా సున్నితంగా ఉండేలా చూస్తుంది.
  5. ఇతరుల అభిప్రాయాలను విని వాటిని అర్థం చేసుకోండి – సంబంధాలలో, ఎదుటి వ్యక్తి ఏమి చెప్పాలనుకుంటున్నాడో వినడం మరియు లోతుగా గ్రహించడం చాలా ముఖ్యం. లేకపోతే, దృఢతను చాలా తప్పుగా ఉపయోగించటం వలన అది సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎదుటివారి మనోభావాలను మనం ఎంత ఎక్కువగా వింటామో, మన దృఢత్వం మరియు పరస్పర అవగాహనతో వారిని అంత ఎక్కువగా సంతృప్తి పరచగలుగుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th november 2024 soul sustenance telugu

ప్రశంసలలో స్థిరంగా ఉండటం

మన విశేషతలు వాలనో లేదా  మనం సాధించిన విజయానికో ఇతరులు మనల్ని మెచ్చుకున్నప్పుడు, వారు మన గురించి చెప్పేది నిజానికి మన గురించి కాదు. మనలో మంచితనాన్ని చూడగలిగే వారి సుగుణాన్ని వారు కనబరుస్తారు.

Read More »
11th november 2024 soul sustenance telugu

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  3)

పరిస్థితుల భారం లేకుండా జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంగా జీవించండి – భారం లేకుండా జీవితాన్ని జీవించడానికి చాలా ముఖ్యమైన అభ్యాసం ప్రయాణాన్ని ఆస్వాదించడం. సైడ్ సీన్లు లేని ప్రయాణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?

Read More »
Maanasika alasatanu adhigaminchdaaniki 5 chitkaalu (part 2)

మానసిక అలసటను అధిగమించడానికి 5 చిట్కాలు (పార్ట్  2)

తప్పనిసరి అయితేనే ఇతరుల గురించి ఆలోచించండి – అవసరం లేనప్పుడు, ముఖ్యమైనది కానప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించడం అనేది మనందరికీ ఉన్న ఒక సాధారణ అలవాటు. మీ కార్యాలయంలోని ఒక వ్యక్తి తన

Read More »