Hin

15th may 2024 soul sustenance telugu

May 15, 2024

సంబంధాలలో క్షమించడం మరియు మరచిపోవడం

సంబంధాలలో తేలికగా మరియు స్థిరంగా ఉండటానికి ఒక ముఖ్యమైన సూత్రం – క్షమించడం మరియు మరచిపోవడం(ఫర్గివ్ అండ్ ఫర్గెట్)  – ఇది సుప్రసిద్ధ సూత్రం – అది ఆచరించడం మనకు కొన్నిసార్లు కష్టమనిపిస్తుంది. దానినే “మరచిపోవాలంటే క్షమించాలి(ఫర్గివ్ టు ఫర్గెట్) ”  అని అనవచ్చు. కొన్నిసార్లు మనం ఒక నిర్దిష్ట వ్యక్తి గురించి ఎంతో చేదు అనుభవంతో చాలా సంవత్సరాలు గడుపుతాము. అవతలి వ్యక్తి అంటే మనల్ని బాధ పెట్టిన వ్యక్తి మనకు ఎలా అయినా ఆ మూల్యం చెల్లించాలని(పగతీర్చుకునే భావోద్వేగాలు) కోరుకునే ఆంతరిక హింసకు లోనవుతాము. మనం వారికి  వెంటనే జవాబు ఇవ్వకలేకపోయినా, ఆ బాధను మన మనసులోనే పెట్టుకుని, తరువాత ఎప్పుడో అది  బయటకు తీస్తాము. అప్పుడు “ఓ అవును, మరి మీరు అలా బాధపెట్టినప్పుడు…….” అని జవాబు ఇస్తాము. మనం క్షమించనందువలనే ఆ చేదుతనాన్ని మనలోనే ఉంచుకుంటాము. ఇది పరిస్థితిని పరిష్కరించదు; అది చేసే ఏకైక పని మన బాధను పెంచి , మానసికంగా భారంగా చేసి , శాంతిగా ఉండనివ్వక పోవడం. కాబట్టి, క్షమించకపోతే, మనం మరచిపోలేము అన్నది ముఖ్యం. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, దానిని వదిలివేయడం మనం చేసే  చివరి ప్రయత్నం. కానీ మన ఆరోగ్యకరమైన, శాశ్వతమైన సంబంధాన్ని కోరుకుంటున్నప్పుడు, మనం చేయవలసింది అదే.

కొన్నిసార్లు, ఆ బాధ ఒక తెగిన సంబంధానికి సంబంధించినప్పుడు, బాధ పెట్టిన వారిని క్షమించడమే కాక , ఆ అనుభవంలోకి వెళ్లడానికి మిమ్మల్ని అనుమతించుకున్నందుకు మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఆ అనుభవాన్ని అనుమతించడానికి అడుగు వేసింది మీరే. మీరు ఆ అడుగు వేయకపోతే,  అలాంటి అనుభవాన్ని చేసుకునేవారు కాదు. మీరు ఆ సంబంధాన్ని ఏర్పరుచుకున్నప్పుడు దానిలో ఉన్న అవకాశాలు, సవాళ్ళు  , ఆ సంబంధంలో ఏమి జరగవచ్చో, అన్నీ మీకు తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, మీరు అవతలి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవడమే కాకుండా, మిమ్మల్ని మీరు క్షమించడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మరిచిపోగలుగుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »
11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »