Hin

14th november 2024 soul sustenance telugu

November 14, 2024

సంబంధాలలో విభేదాలను ఎలా పరిష్కరించాలి? (పార్ట్ 1)

సంబంధాలలో, కొన్నిసార్లు అవతలి వ్యక్తి సమస్య మాత్రమే కాదు, సంఘర్షణలకు మూలం కూడా అని మనం భావిస్తాము. సంఘర్షణ జరగాలంటే ఎల్లప్పుడూ ఇద్దరు వ్యక్తులు పాల్గొనాలని మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా సంఘర్షణలో ఉన్నప్పుడు, సంఘర్షణ ప్రక్రియ యొక్క అసలైన కారణాలను, నిజమైన శక్తిని చూడటం మరియు అర్థం చేసుకోవడం కష్టం. సంఘర్షణ సమయంలో మనలో తలెత్తే భావోద్వేగాలు మన దృష్టిని మరల్చి, కారణాలు కనిపించకుండా కూడా చేస్తాయి.

మొదటిగా, సంఘర్షణ యొక్క ఏ పరిస్థితిలోనైనా మీ ప్రతిస్పందన సంఘర్షణకు మీ సహకారం అని గుర్తించడం ముఖ్యం. ఏ వ్యక్తికైనా లేదా పరిస్థితికి ప్రతిస్పందించే ప్రక్రియ అనేది మీ లోపల జరిగే విషయం. మీ అనుమతి లేకుండా ఏదీ మీకు అనుభూతిని కలిగించలేదు. మీరు కొంతకాలంగా ఎవరితోనైనా సంఘర్షణలో ఉంటే, ఖచ్చితంగా, మీరు వారి పట్ల భయం లేదా కోపాన్ని సృష్టిస్తారు. తద్వారా మీరు వారితో సంభాషించేటప్పుడు లేదా సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రతిఘటన ప్రవర్తనలను వ్యక్తం చేస్తారు. మీ భావోద్వేగాలకు లేదా మీ ప్రవర్తనకు అవతలి వ్యక్తి బాధ్యులు కారు.

సంఘర్షణ యొక్క మీ అనుభవం మరియు సంఘర్షణకు మీ సహకారం మీ స్మృతిలో ప్రారంభమవుతుంది. మీరు వాటిని మీ స్మృతిలో ఉంచుకుంటారు. ఇది మరొకరి పట్ల మీ దృష్టికోణంతో ప్రారంభమవుతుంది. మీరు వారిని ప్రతికూలంగా గ్రహించినట్లయితే మీరు ప్రతికూలంగా ఆలోచిస్తారు; మీరు ప్రతికూలంగా భావించి ప్రతికూల వైఖరిని సృష్టిస్తారు మరియు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు, కాబట్టి మీరు ప్రతికూల శక్తిని ప్రసరిస్తారు. మీరు ఆ విధంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. దృష్టికోణం అనేది ఒక ఎంపిక.

సంఘర్షణ జరిగినప్పుడు మానసికంగా, ఎమోషనల్ గా బాధ ఉంటుంది, శారీరకంగా కూడా ఉంటుంది. ఆ బాధను ఎవరు సృష్టిస్తారు? మీరే! కనీసం సగం సంఘర్షణను ఎవరు సృష్టిస్తారు? మీరే! మీరు దానిని ఎక్కడ అంతం చేస్తారు? మీ భావనలో – మీ లోపల. సంఘర్షణ నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోవడం అనేది ఒక నిర్ణయానికి సంబంధించిన విషయం. ఏ క్షణంలోనైనా మీరు సంఘర్షణలో ఉండకూడదని నిర్ణయించుకోవచ్చు. పరిష్కార ప్రక్రియ ప్రారంభించడానికి, ఒక పక్షం వారు తాత్కాలికంగా అయినా సంఘర్షణకు వారి సహకారాన్ని ఆపేయాలి..

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th april 2025 soul sustenance telugu

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు

Read More »
25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »