Hin

15th november 2024 soul sustenance telugu

November 15, 2024

సంబంధాలలో విభేదాలను ఎలా పరిష్కరించాలి (పార్ట్ 2)

సంఘర్షణ సమయంలో, మీరు సంఘర్షణకు ఏ రకమైన శక్తిని ఇస్తారో అదే రకమైన శక్తి మీకు ప్రతిఫలంగా లభిస్తుందని తెలుసుకోవటం మంచిది. ఇది కారణ పరిణామాల నియమం. సూక్ష్మ స్థాయిలో, మనం మన వైఖరి ప్రకారంగా ప్రసరిస్తాము. భౌతిక స్థాయిలో, మన ప్రవర్తన ప్రకారంగా ప్రసరిస్తాము. సూక్ష్మంగా మరియు భౌతిక స్థాయిలో మనం ప్రసరించేది మనకు అదే విధంగా తిరిగి వస్తుంది. అవతలి వ్యక్తి తెలివైన వారై మనకు అదే ప్రతికూల శక్తిని తిరిగి ఇవ్వకూడదని నిర్ణయించుకుంటే తప్ప, బదులుగా మనతో సానుకూల వైఖరి, ప్రవర్తనతో వ్యవహరించాలని నిర్ణయించుకుంటే తప్ప అదే రకమైన శక్తి మనకు లభించకుండా ఉండదు. ఆ విధంగా, సానుకూలంగా వ్యవహరించే వ్యక్తి మనలో ఆధారపడటాన్ని తీసుకురావడం లేదు. కానీ మన స్వంత ప్రతికూలత నుండి విముక్తి పొందడానికి వారు మనకు సహాయపడతారు.

తరచుగా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ వచ్చేది ఎందుకంటే సంబంధంలో మనకు కావలసిన ఫలితం రాకపోవటం; మనం ఒక నిర్దిష్ట ఫలితాన్ని పొందడంలో చిక్కుకొని మన సంతోషాన్ని దానిని పొందడంపై ఆధారపడేలా చేస్తాము. అది లభించనప్పుడు, మనం తప్పు పద్ధతిని ఉపయోగిస్తాము; మనం సంఘర్షణను సృష్టిస్తాము, మనం బాధితులమని భావిస్తాము, మరొకరిని నిందిస్తాము, మన బాధను వారిపై చూపిస్తాము; ఇవన్నీ ఇతరులు మనల్ని సంతోషపరుస్తారు లేదా అసంతృప్తపరుస్తారనే నమ్మకంతో. ఇది తప్పుడు నమ్మకం. మీ సంతోషం మీ ఆపేక్షలను నెరవేర్చడంపై ఆధారపడి ఉన్నప్పుడు, సదా సంతోషంగా ఉండటం కష్టం. ఎక్కువగా ఆపేక్షలనేవి మారువేషంలో ఉండే కోరికలు. కోరికలు ఉన్న చోట భయం ఉంటుంది – మీకు కావలసినది లభించదనే భయం. మీకు అది లభించనప్పుడు మీరు అసంతృప్తి చెందుతారు. అలా మీరు సంతోషాన్ని మీ నుండి దూరంగా ఉంచుతారు. శాంతియుత సంబంధాల లక్ష్యాలను మీకు మీరే పెట్టుకోవటం మంచిది, కానీ అవి నెరవేరకపోతే లేదా ఈ లక్ష్యాలను సాధించడానికి సమయం తీసుకుంటే, మీ శ్రేయస్సు యొక్క భావాన్ని కోల్పోకండి. ఇతరుల ఆపేక్షలను నెరవేర్చడంలో బాహ్యంగా మీరు పొందే దానికంటే మీ సంతోషమే చాలా విలువైన నిధి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »
17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »