Hin

4th october 2024 soul sustenance telugu

October 4, 2024

సంబంధాలలో వ్యంగ్యానికి దూరంగా ఉండటం

భావోద్వేగపరంగా(ఎమోషనల్ గా) గాయపడినప్పుడు, స్వయాన్ని మెరుగ్గా చూపించడానికి ఇతరులను నిందిస్తాము. ప్రశంసలు, విమర్శలు లేదా కోపంలో ఉపయోగించినా, వ్యంగ్యం అనేది ప్రతికూల శక్తి. హాస్యభరితంగా, చమత్కారంగా అనిపించాలనే సాకుతో, మీరు వ్యంగ్యంగా ఉన్నారా? వ్యంగ్యం  స్వాభావికంగా ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది, అందువల్ల అది మన సంబంధాలను బలహీనపరుస్తుంది. ఒకరి గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం మన స్వంత సౌరభాన్ని(ఓరా), వైబ్రేషన్లను క్షీణింపచేస్తుంది.

  1. మీ నిందలను స్వీకరించే వ్యక్తి బాధపడుతున్నాడని లేదా కోపంగా ఉన్నాడని గుర్తుంచుకోండి. వ్యంగ్యం ఎల్లప్పుడూ మిమ్మల్ని తెలివైన వారిలా లేదా తమాషాగా అనిపించేలా చేయకపోవచ్చు. కానీ బదులుగా మీరు ద్వేషం, అసూయ, బాధ, కోపం లేదా అభద్రతను కలిగి ఉన్నారని వెల్లడిస్తుంది. ఇది ఒక వ్యక్తిగా మీ విశ్వసనీయతను తగ్గిస్తుంది.
  2. వ్యంగ్యానికి మూల కారణం మీ స్వంత భావోద్వేగ గాయాలలో ఉంది. మీరు ఆంతరికంగా అసౌకర్యంగా ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో మీరు కఠినంగా మారతారు. మీ భావోద్వేగాలు పూర్తిగా మీ సృష్టి అని అంగీకరిస్తూ, మిమ్మల్ని మీరు నయం చేసుకునే బాధ్యత తీసుకోండి.
  3. మీరు మాట్లాడే ప్రతి మాట శక్తి. అది మిమ్మల్ని, మీ వాతావరణాన్ని శక్తివంతం చేస్తుంది లేదా బలహీనపరుస్తుంది. సానుకూలంగా ఆలోచించడానికి మరియు మీ దయ, కరుణ యొక్క సద్గుణాలను బయటపెట్టడానికి ప్రతిరోజూ ధ్యానం చేయండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. అప్పుడు మీరు మీ సంభాషణలలో సరైన, సానుకూల పదాలను ఎంచుకోవడం ప్రారంభిస్తారు.
  4. ప్రతి సన్నివేశంలో స్వచ్ఛమైన, ఉన్నత శక్తి గల పదాలను మాత్రమే ఉపయోగిస్తానని మీకు మీరే వాగ్దానం చేసుకోండి. ఇతరులు సరిగ్గా ఉండకపోవచ్చు లేదా పరిస్థితులు సవాలుగా ఉండవచ్చు. మీ వైబ్రేషన్లను బలహీనపరిచేందుకు వాటిని అనుమతించవద్దు. కొన్ని రోజుల శ్రద్ధ మీ పదజాలాన్ని శుభ్రపరచి, మీ వ్యక్తిత్వంలో వ్యంగ్యాన్ని అంతం చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »