Hin

25th august 2024 soul sustenance telugu

August 25, 2024

సంబంధాలను సామరస్యపరిచి బాధ్యతను స్వీకరించడం

వివాదాస్పద సంబంధంలో, సమస్య ఆ వ్యక్తితో కానీ లేదా మన మధ్య కానీ ఉండదు. సంఘర్షణ అనేది మన మనస్సులో ఉంటుంది, మనం అవతలి వ్యక్తి గురించి ఎలా ఆలోచిస్తున్నామని – అంటే వారిని నిందించడం, ప్రతిఘటించడం లేదా తిరస్కరించడం. ఇద్దరం సంఘర్షణను సృష్టించాం కాబట్టి దాన్ని పరిష్కరించడానికి ఇద్దరూ అవసరం అని మనం నమ్ముతుంటాము. నిజం ఏమిటంటే, మనలో ఒకరు మరొకరి గురించి బాగా ఆలోచించినా, సంఘర్షణ దూరమవడం ప్రారంభిస్తుంది. మీకు ఎవరితోనైనా విభేదాలు ఉన్నప్పుడు, మీరు బాధపడుతూ లేదా కోపంగా ఉంటూ సామరస్యాన్ని పునరుద్ధరించడానికి వారు ఏదైనా చేయాలని ఆశిస్తున్నారా? దాన్ని ముందులా స్నేహపూర్వకంగా తిరిగి తీసుకురావడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారా? లేదా, మీ ఇద్దరూ సంఘర్షణను ప్రారంభించినందున, మీరిద్దరూ సంబంధాన్ని మంచిగా చేయాల్సిన అవసరం ఉందని మీరు నమ్ముతున్నారా? ఒక వ్యక్తి మరొకరి పట్ల ప్రతికూలంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు సంబంధం క్షీణించడం ప్రారంభిస్తుంది. మాటలు, ప్రవర్తనలు పరిపూర్ణంగా ఉండవచ్చు, కానీ ప్రతికూల ఆలోచన ప్రకంపనలు బంధం యొక్క పునాదిని తాకుతూ, ధోరణిని మార్చేసి, దానిని త్వరగా సంఘర్షణగా మారుస్తుంది. వివాదాస్పదమైన సంబంధాన్ని సరి  చేయడానికి ఒక వ్యక్తి మాత్రమే అవసరం. మనం ఆ ఒక వ్యక్తిగా ఉందాం. ఈ సమస్యకు మనలో ఒకరు లేదా ఇద్దరూ బాధ్యులా అనేది పట్టింపు కాదు. ఎంత ప్రతికూలతను ఇచ్చిపుచ్చుకున్నామనేది కూడా పట్టింపు కాదు. మనలో ఒకరు మరొకరి పట్ల సానుకూలంగా, స్వచ్ఛంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు, మన వైబ్రేషన్లు ప్రసరిస్తాయి మరియు వారి ఆలోచనా విధానాన్ని కూడా మారుస్తాయి. మరియు వారు నయం అయిన తర్వాత, సంఘర్షణ దూరమయ్యి సామరస్యం సృష్టించబడుతుంది. మీకు ఉన్న ఏదైనా వివాదాస్పదమైన సంబంధాన్ని సరి చేసే బాధ్యతను తీసుకోండి. గతాన్ని వదిలేయండి, వారిని క్షమించండి మరియు ఆ వ్యక్తుల కోసం స్వచ్ఛమైన, అందమైన ఆలోచనలను చేయండి. సంబంధం యొక్క శక్తిని మార్చడానికి వారి గురించి ఉన్న మీ ఆలోచనను మార్చుకోండి.

 

మీరు అందరితో బాగా కలిసిపోతే మీ సంబంధాలు సంతోషం మరియు సామరస్యానికి మూలం అవుతాయి. ఏవైనా విభేదాలు ఉంటే, సంఘర్షణల నుండి వైదొలగండి. మీరు అవతలి వ్యక్తి దృక్పథాన్ని అర్థం చేసుకోలేక పోయినప్పటికీ, వారు చెప్పేది లేదా చేసేది ఆ సమయంలో వారికి అది నిజం అని తెలుసుకోండి. ఇదే సరైనది లేదా ఉన్నతమైనది అనే అహం కంటే సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు సంఘర్షణను పరిష్కరించడానికి నిజాయితీగా ప్రయత్నించండి. అవతలి వ్యక్తి మిమ్మల్ని సరి చేసే వరకు వేచి ఉండకండి. వారు బాధతో మీకు ప్రతికూల శక్తిని పంపవచ్చు, కానీ మీరు స్థిరంగా ఉండి, మీ శ్రద్ధగల మరియు ప్రేమగల వైబ్రేషన్లతో వారి ప్రతికూలతను ఎదుర్కోవచ్చు. మీ వైపు నుండి ప్రేమ శక్తి ప్రవహిస్తూ ఉండేలా చూసుకోండి, సామరస్యం యొక్క ఆలోచనలను సృష్టించండి, మీ సంబంధం పరిపూర్ణంగా ఉందని విజువలైజ్ చేసుకోండి. స్వచ్ఛమైన వైబ్రేషన్లను ప్రసరింపజేయండి, తద్వారా వారు వారి మానసిక ఫ్రీక్వెన్సీని పెంచి మీ వైబ్రేషన్ల మాదిరిగానే మరింత సానుకూలంగా, స్వచ్ఛంగా ఉంటారు. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »