Hin

20th march 2025 soul sustenance telugu

March 21, 2025

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 2)

మనం బాధపడినప్పుడు, కొన్నిసార్లు ఇతరులను క్షమించడం మనకు కష్టమవుతుంది. క్షమాపణ మాత్రమే ప్రతికూలతను కరిగించడానికి సహాయపడుతుందని మనం గుర్తుంచుకుంటే, అది జీవితంలో పెద్ద అవకాశాలను చేరుకోవడాన్ని సులభం చేస్తుంది. అలాగే, క్షమాపణతో మమకారం ముడిపడి ఉంటుంది. మమకారం ఎంత ఎక్కువగా ఉంటే, క్షమించడం అంత కష్టం అవుతుంది. మమకారం లేని ప్రేమతో  క్షమించడం సులభం. సంబంధాలలో భౌతిక, మానసిక, భావోద్వేగాలు ఉన్నప్పుడు, ఏదైనా గాయం తగిలితే అది ఎప్పటికీ మనపై చెరగని ముద్ర వేసి మనలను మునుపటిలా ఉండనియ్యవు. కానీ మనల్ని మనం ఒక సూక్ష్మమైన తేలికపాటి స్థితికి తీసుకువస్తే, ఎక్కడైతే వివేకంతో సంబంధం చాలా లోతుగా ఉండి, ఒక కథలో మన పాత్రను ఒక పాత్రగా పోషించి, స్విచ్ ఆఫ్ చేయగల విధంగా ఉండి, ఎటువంటి ముద్రలను వదిలిపెట్టనివ్వకుండా ఉంటె మనం మరింత సురక్షితంగా ఉంటాము. 


ఒక వ్యక్తికి సంబంధించిన ఏదైనా పరిస్థితి వల్ల మనం తీవ్రంగా బాధపడినప్పుడల్లా, అది ఉద్దేశపూర్వకంగా మనకు సంభవించినా లేదా మనం దానిలోకి లాగబడినా, మనల్ని మనం నయం చేసుకోవడానికి చర్యలు తీసుకోవచ్చు. మొదట, సహనంతో కూడిన వైఖరి చాలా అవసరం. ఇది స్వయం యొక్క ఒక సహజ ప్రక్రియ మాత్రమే, కానీ దీన్ని అతి త్వరగా చేయలేం. అలాగే, సౌమ్యత్వం, సున్నితత్వం మరియు ఔదార్యం మరియు ఇతర ఆత్మను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ఇది సమయం మరియు శ్రమతో కూడుకున్నది, అందువల్ల అది బయటపడటానికి అవసరమైన సమయాన్ని మనం ఇవ్వాలి. అలాగే, గాయం ఒక అదృశ్య కవచాన్ని సృష్టిస్తుంది, ఇది మనకు స్వేచ్ఛగా ఉండడాన్ని కష్టతరం చేస్తుంది, తద్వారా మనకు కఠినంగా మరియు అసురక్షితంగా అనిపిస్తుంది. ఈ కవచం కొన్నిసార్లు మనకు మనం చేసుకునే అర్ధవంతమైన సంభాషణలతో స్వీయ-అభివృద్ధి అవకాశాల నుండి మనల్ని దూరం చేస్తుంది. ఇలా చేయడం వలన నేను మరింత వాస్తవికంగా, తెలివిగా అవుతున్నాను అని అనుకున్నప్పటి నుంచి మనలో అవగాహన లోపించి మనం తయారు చేసుకున్న గూడులోనే ఉంటాము. సంబంధాలలో, అపార్థాల కారణంగా ఇతరులకు బాధ కలిగించడం మరియు తలుపులు మూసివేయడం వల్ల కలిగే పరిణామాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తెలియని గాయాల నీటిలో ఎలా విజయవంతంగా ప్రయాణించాలో మనం నేర్చుకోవాలి. మనం బాధపడినప్పుడు, కొన్నిసార్లు ఇతరుల ప్రేమకు దూరమవుతాము. ఫలితంగా, సంబంధాలలో ఇవ్వడం వల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించే సామర్థ్యాన్ని కూడా మనం కోల్పోతాము.

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »