Hin

25th may 2025 soul sustenance telugu

May 25, 2025

సంబంధాల నాణ్యత మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి 10 మార్గాలు (పార్ట్ 2)

  1. అందరితో స్నేహం చేసుకోండి, ఎవరినీ ద్వేషించకండి. ఈ ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, వారందరూ మీ దృష్టిలో ప్రత్యేకంగా ఉండాలి. మీరు ఆధ్యాత్మిక ప్రేమ యొక్క స్థిరమైన దృష్టిని ఎంత ఎక్కువగా ఉంచుకుంటే, ప్రతి ఒక్కరూ మీకు అంత దగ్గరవుతారు.
  2. ప్రతి ఒక్కరినీ ఒక ఆత్మగా మరియు ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్న భగవంతుని బిడ్డగా చూడండి. భగవంతుడు ప్రతి ఒక్కరినీ గౌరవంతో చూస్తారు మరియు వారిని ఈ ప్రపంచంలో ముఖ్యమైనవారిగా చూస్తారు. నేను కూడా ప్రతి ఒక్కరి పట్ల అదే దృక్పథాన్ని కలిగి ఉండాలి. వారి గురించి ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలి.
  3. ప్రతి ఉదయం కార్యాచరణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందు, మీతో మీరు మాట్లాడుకుంటూ ఈ రోజు ప్రతి సంబంధంలో, మీరు ఒక వ్యక్తిని కలిసినా లేదా ఒక వ్యక్తితో మాట్లాడినా లేదా కేవలం ఒక వ్యక్తి గురించి ఆలోచించినా, మీరు వారితో శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని కొనసాగించి, వారికి ఆ శక్తిని మాత్రమే ప్రసరింపజేస్తారని మీరే వాగ్దానం చేసుకోండి.
  4. మీ మనస్సులో ఒక ధృవీకరణను సృష్టించుకోండి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని మరియు మీరు కూడా వారితో సంతోషంగా ఉన్నారని రోజులో ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండండి. మీ కుటుంబంలో మరియు కార్యాలయంలో ప్రతి ఒక్కరి మధ్య సానుకూల బంధాన్ని ఏర్పరచుకోండి. సమైక్యత ఎంత ఎక్కువగా ఉంటే, అన్ని సంబంధాలు అంతే అందంగా ఉంటాయి.
  5. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు గడిచిన రోజును సమీక్షించి, మీ ప్రవర్తనతో రోజులో ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచారా అని రోజువారీ అంచనా వేసుకోండి. అలాగే, మీరు మీ తప్పుడు ఆలోచనలు, మాటలు లేదా చర్యల ద్వారా ఎవరికీ ఎటువంటి బాధను కలిగించలేదని లేదా ఇతరుల ప్రకంపనలు, మాటలు లేదా ప్రవర్తన కారణంగా ఎవరి నుండి ఎటువంటి బాధను పొందలేదని చెక్ చేసుకోండి.
  6. మీ రోజును ఆస్వాదించండి మరియు భగవంతునికి మీ సంబంధాల యొక్క అన్ని బాధ్యతలను ఇవ్వండి. భగవంతుని సానుకూల శక్తి మరియు మీ సానుకూల శక్తి ప్రతిదీ చూసుకుంటాయని నమ్మండి. ఏదైనా సంబంధం అసంపూర్ణంగా అనిపించినప్పటికీ, భగవంతుని నుండి మంచితనాన్ని నింపుకొని దానిని ఎటువంటి చింత లేకుండా ఆ వ్యక్తికి వ్యాప్తి చేయడం కొనసాగించండి, ప్రతిదీ సరి అవుతుంది.

ఈ సందేశంలో మనం చర్చించిన మొత్తం 10 మార్గాలు ఆధ్యాత్మిక సాధనాలు, ఇవి సంబంధాలలో సానుకూలత మరియు తేలికతనాన్ని కొనసాగించడానికి అన్ని సమయాల్లో ఉపయోగపడతాయి.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »