Hin

27th june 2025 soul sustenance telugu

June 27, 2025

సంబంధం యొక్క విత్తనాలు

మనలో చాలా మందకి ఉన్న తప్పుడు నమ్మకం ఏమిటంటే, సంబంధాలు అంటే సరైన పద్ధతిలో ప్రవర్తించడం మరియు మాట్లాడడం మాత్రమే అని. ఎందుకంటే మనం మాట్లాడే మరియు చేసే వాటిని మాత్రమే అందరూ చూస్తారు, తెలుసుకుంటారు మరియు అంచనా వేస్తారు అని అనుకుంటాము. మనం ఏం ఆలోచిస్తున్నామో వారు పసిగట్టలేరని అనుకుంటాం, కాబట్టి వారి గురించిన మన ఆలోచనలకు మనం శ్రద్ధ చూపము. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి – అవతలి వ్యక్తి మీ మాటలను మాత్రమే వినగలరని నమ్ముతూ మీరు ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ పాజిటివ్ మాటలను మాట్లాడారా? మీరు బోరు కొడుతోంది అని అనుకుంటూ, వారిని కలవడం చాలా అద్భుతంగా ఉందని మీరు ఎప్పుడైనా చెప్పారా? మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో మనం ఎంత విభిన్నంగా ఉన్నామో చూడడానికి లోతైన పరిశీలన మరియు స్థిరమైన అవగాహన అవసరం. సంబంధం అనేది ఒక పాత్ర లేదా బాధ్యత యొక్క లేబుల్ కాదు – తల్లితండ్రులు, భార్యభర్తలు , సోదర సోదరీలు , స్నేహితులు, సీనియర్ జూనియర్ లేదా ఇద్దరు అపరిచితులు. సంబంధం అనేది రెండు ఆత్మల మధ్య శక్తిని ఇచ్చిపుచ్చు కోవటం. ప్రతి ఆత్మ ఆలోచనలు, మాటలు మరియు చర్యల శక్తిని సృష్టిస్తుంది. ఏ ఆత్మతో మనం ఈ శక్తిని ఇస్తున్నామో , ఆ సమయంలో మనం వారితో సంబంధం కలిగి ఉంటాము.

మనం నిమిషానికి 25 నుండి 30 ఆలోచనలను సృష్టిస్తాము; మనము ఒక నిమిషంలో 3 నుండి 4 వాఖ్యాలు మాట్లాడవచ్చు మరియు ఒక నిమిషంలో 1 నుండి 2 చర్యలు చేయవచ్చు. ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ మరియు ఆలోచన శక్తి ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి, ఆలోచనలు సంబంధానికి ఆధారం అవుతాయి. అలాగే, మనం భౌతికంగా ఒకరితో ఒకరు లేకపోయినా ఆలోచనలు సృష్టించబడతాయి. కాబట్టి, మనం వారితో మాట్లాడే మాటల కంటే లేదా ప్రతిరోజూ వారి పట్ల మన ప్రవర్తన కంటే ఆ వ్యక్తి గురించి మనం సృష్టించే ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఆత్మ పట్ల, ప్రతి సారి, మన ప్రతి ఆలోచనను జాగ్రత్తగా చేయాలి, ఇది మన సంబంధానికి పునాది అని బాగా గుర్తుంచుకోండి. మనం ఏదైనా సంబంధం యొక్క క్వాలిటిను మార్చాలనుకుంటే, వారి  గురించి మన ఆలోచనలను మాత్రమే చెక్ చేసుకోవాలి. మన ఆలోచనలను మార్చుకొంటే సంబంధం మారుతుంది.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »