Hin

7th oct 2023 soul sustenance telugu

October 7, 2023

సంబంధం యొక్క విత్తనాలు

మనలో చాలా మందకి ఉన్న తప్పుడు నమ్మకం ఏమిటంటే, సంబంధాలు అంటే సరైన పద్ధతిలో ప్రవర్తించడం మరియు మాట్లాడటం. ఎందుకంటే మనం మాట్లాడే మరియు చేసే వాటిని మాత్రమే అందరూ చూస్తారు, తెలుసుకుంటారు మరియు అంచనా వేస్తారు అని అనుకుంటాము. మనం ఏం ఆలోచిస్తున్నామో వారు పసిగట్టలేరని అనుకుంటాం, కాబట్టి వారి గురించిన మన ఆలోచనలకు మనం శ్రద్ధ చూపము. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి – అవతలి వ్యక్తి మీ మాటలను మాత్రమే వినగలరని నమ్ముతూ మీరు ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ పాజిటివ్ మాటలను మాట్లాడారా? మీరు బోరు కొడుతోంది అని అనుకుంటూ, వారిని కలవడం చాలా అద్భుతంగా ఉందని మీరు ఎప్పుడైనా చెప్పారా? మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో మనం ఎంత విభిన్నంగా ఉన్నామో చూడడానికి లోతైన పరిశీలన మరియు స్థిరమైన అవగాహన అవసరం. సంబంధం అనేది ఒక పాత్ర లేదా బాధ్యత యొక్క లేబుల్ కాదు – తల్లితండ్రులు, భార్యభర్తలు , సోదర సోదరీలు , స్నేహితులు, సీనియర్ జూనియర్ లేదా ఇద్దరు అపరిచితులు. సంబంధం అనేది రెండు ఆత్మల మధ్య శక్తిని ఇచ్చిపుచ్చు కోవటం. ప్రతి ఆత్మ ఆలోచనలు, మాటలు మరియు చర్యల శక్తిని సృష్టిస్తుంది. ఏ ఆత్మతో మనం ఈ శక్తిని ఇస్తున్నామో , ఆ సమయంలో మనం వారితో సంబంధం కలిగి ఉంటాము.

మనం నిమిషానికి 25 నుండి 30 ఆలోచనలను సృష్టిస్తాము; మనము ఒక నిమిషంలో 3 నుండి 4 వాఖ్యాలు మాట్లాడవచ్చు మరియు ఒక నిమిషంలో 1 నుండి 2 చర్యలు చేయవచ్చు. ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ మరియు ఆలోచన శక్తి ధ్వని కంటే వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి, ఆలోచనలు సంబంధానికి ఆధారం అవుతాయి. అలాగే, మనం భౌతికంగా ఒకరితో ఒకరు లేకపోయినా ఆలోచనలు సృష్టించబడతాయి. కాబట్టి, మనం వారితో మాట్లాడే మాటల కంటే లేదా ప్రతిరోజూ వారి పట్ల మన ప్రవర్తన కంటే ఆ వ్యక్తి గురించి మనం సృష్టించే ఆలోచనల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఆత్మ పట్ల, ప్రతి సారి, మన ప్రతి ఆలోచనను జాగ్రత్తగా చేయాలి, ఇది మన సంబంధానికి పునాది అని బాగా గుర్తుంచుకోండి. మనం ఏదైనా సంబంధం యొక్క క్వాలిటిను మార్చాలనుకుంటే, వారి  గురించి మన ఆలోచనలను మాత్రమే చెక్ చేసుకోవాలి. మన ఆలోచనలను మార్చుకొంటే సంబంధం మారుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »