Hin

20th jan 2024 soul sustenance telugu

January 20, 2024

సమృద్ధి యొక్క వైఖరి

ఈరోజు జరిగిన సంఘటన కారణంగా మీ సానుకూల వైఖరి తగ్గి ఉండవచ్చు. అయితే తగ్గిన వైఖరిని మీరు తర్వాత వచ్చే సందర్భాలలోకి, రోజంతటిలోకి తీసుకువస్తున్నారా? లేక ఆగి, మీ మూడ్‌ను సెట్ చేసుకుని, మీ దృక్పథాన్ని పునరుద్ధరించుకున్నారా? చాలాసార్లు, మనం వ్యక్తులతో, పరిస్థితులతో, వస్తువులతో, ప్రకృతితో, ప్రపంచంతో అసంతృప్తిగా ఉంటాము. మనకు లేని దాని గురించే మనం ఫిర్యాదు చేస్తుంటాము – ఆరోగ్యం, సంతోషం, సౌకర్యాలు, సమయం, సంపద, బంధాలు … ఇలా లిస్టు పెద్దగా ఉండవచ్చు. వాస్తవానికి మనకు విభిన్నమైన ఫలితం కావాలంటే, ముందుగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి – లోటు వైఖరి కాకుండా సమృద్ధి వైఖరి ఉండాలి. సానుకూల వైఖరి పూర్తి జీవితాన్ని నియంత్రణలోకి తెస్తుంది. ఇది ఆరోగ్యం, సంతోషం, సంబంధాలు, విజయాన్ని పెంచుతాయి. పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా కానీ మనం చూసే దృష్టికోణాన్నిబట్టి వచ్చింది ఒక అవకాశంలా భావించి నేర్చుకుని, ఎదిగేందుకు మార్గంలా చూస్తామా లేక ఒక వైఫల్యంగా చూస్తామా అన్నది మన వైఖరిని బట్టే ఉంటుంది. మీ వైఖరిని ప్రతి రోజూ పరిశీలించుకుని, మీ మనస్తత్వానికి బాధ్యత వహిస్తూ సానుకూలంగా ఉండండి. అప్పుడు పరిస్థితులు మీ నియంత్రణలోకి ఎలా వస్తాయో చూడండి. గుర్తుంచుకోండి – నేను సమృద్ధి వైఖరితో ఉన్నాను. నాకు కావలసిందంతా నా వద్ద ఉంది. నా వైఖరి సరైన వ్యక్తులను, పరిస్థితులను ఆకర్షిస్తుంది.

వైఖరే సర్వస్వము అని మనకు నేర్పించారు. ఆగి, పరిశీలించుకోండి – ఈ మధ్య కాలంలో మీ వైఖరి మొత్తంగా ఎలా ఉంది? ఆశావాదంతో, సానుకూలంగా, నిర్భయంగా, సంతృప్తిగా ఉన్నారా? మీ వైఖరి మీకు ప్రపంచాన్ని సానుకూల అద్దాల ద్వారా చూసే అవకాశాన్ని ఇచ్చిందా లేక అన్నీ మంచిగా ఉన్నప్పుడే మీకు అన్నీ మంచిగా కనిపిస్తున్నాయా? మీ వైఖరే మీ ఎదుగుదలకు అవసరమైన ద్వారాలను మూసివేయాలా లేక తెరవాలా అని నిర్ణయిస్తుంది. ఎందుకంటే మీరు ఉత్పన్నం చేసే ప్రతి ఆలోచన వెనుక ఒక భావన కూడా ఉత్పన్నమవుతుంది. కాలక్రమేణా మీ భావనలు మీ వైఖరిని తయారు చేస్తాయి – వ్యక్తుల గురించి, పరిస్థితుల గురించి, పని మరియు ప్రపంచం గురించి. కనుక, వ్యక్తులు మరియు పరిస్థితుల గురించి మీకున్న భావనల ప్రకారంగా మీరు వైఖరిని ఏర్పరచుకుంటారు – అంగీకరించడమా లేక తిరస్కరించడమా, గౌరవమా లేక అగౌరవమా అని. మన ఆలోచనలే మన వైఖరిని తయారు చేస్తాయి కాబట్టి వైఖరి మార్చుకోవడం అంటే మన ఆలోచనలను మార్చుకోవడమే. జీవితం సమృద్ధిగా ఉందా లేక లోటుతో ఉందా అన్నది కూడా మన వైఖరిని బట్టే ఉంటుంది కానీ మన వద్ద ఉన్నదాని బట్టి కాదు. మంచి జీవితానికి మంచి వైఖరి అవసరం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »