Hin

20th sep 2024 soul sustenance telugu

September 20, 2024

సమూహాలలో ఆధ్యాత్మిక ఉన్నతిని అనుభూతి చెందడం  (పార్ట్ 1)

ఆధ్యాత్మిక అభివృద్ధి వైపు మొగ్గు చూపే ఎవరైనా తమకు సమానమైన మనస్తత్వంగల ఆధ్యాత్మిక సమూహాలలో భాగం అవ్వడం అవసరం అని భావిస్తారు. ఇటువంటి సమూహాలు, సమావేశాలు లేదా సంఘాలు జీవనశైలి అలవాట్లును, మార్గదర్శకాలను అందిస్తాయి. వారి సభ్యులు ధ్యానం, ప్రార్థనలు లేదా సేవ వంటి ఆధ్యాత్మిక కార్యాలలో పాల్గొని,  క్రమంగా కలిసి పరివర్తన చెందుతారు. మరోవైపు, ఆధ్యాత్మికంగా ప్రేరేపించబడే కొంతమంది వ్యక్తులు సమూహాలు లేదా సమాజాలలో భాగం కావడానికి ఆసక్తి చూపకపోవచ్చు. వారు ఒంటరిగానే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని, పుస్తకాలు, ఆన్లైన్ వనరులు, టెలివిజన్ లేదా వీడియోల నుండి మాత్రమే మార్గదర్శకత్వం తీసుకోవాలని, సమూహంలో భాగం కాకూడదని నమ్ముతారు. ఒక వ్యక్తి ఏదైనా ఒక మార్గం నిర్ణయించే ముందు మూల్యాంకనం చేయాలనుకునే కొన్ని అంశాలు ఉన్నాయి.

 

 మనం ఒంటరిగా ఆధ్యాత్మిక మార్గంలో పనిచేసినప్పుడు, మన వ్యక్తిత్వం పూర్తిగా సక్రియం కాదు. మనము మన స్వంత నిబంధనల ప్రకారం, స్వంత సమయపాలన ప్రకారం సాధన చేస్తాము. సహకరించడానికి, సహించడానికి, స్వీకరించడానికి మరియు సర్దుబాటు చేసుకోడానికి మన శక్తులను పూర్తిగా వ్యక్తీకరించే అవకాశం మనకు లభించదు. అలాగే, వేరే దేనికైనా ప్రాధాన్యత ఇచ్చి, మన దృష్టిని ఆధ్యాత్మిక ఎదుగుదల నుండి దూరం చేసినప్పుడు మన ఆధ్యాత్మిక దినచర్య దెబ్బతింటుంది. మనం ఒక సమాజంలో భాగమైనప్పుడు, పరస్పర చర్యలలో మన వ్యక్తిత్వం యొక్క అనేక ఛాయలు ప్రేరేపించబడతాయి. ఆ సమయంలో మన ఆధ్యాత్మిక సమాజంలోని సభ్యులు గమనించి మనకు అభిప్రాయాన్ని ఇవ్వవచ్చు. వారి స్వచ్ఛమైన ఉద్దేశాలు మరియు ఆ సమావేశం యొక్క ప్రకంపనలు నిరంతరం మనల్ని మెరుగుపడటానికి ప్రేరేపిస్తాయి. ఇది చిన్నప్పటి నుండి మన కుటుంబం మరియు స్నేహితుల నుండి మనకు లభించే పెంపకం వంటిది – ఎప్పటికప్పుడు వారు మనలో ఉన్న ఉత్తమమైన వాటిని ప్రోత్సహించి, వాటిని బయటకు తీసుకువస్తారు.

 

ఆధ్యాత్మిక అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం మన ప్రతికూల అలవాట్లను అంతం చేసి ఆత్మ స్మృతిని పొందడం. దీని అర్థం మన బలాలు మరియు బలహీనతలను క్రమానుగతంగా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మనము ఒక సమాజంలో లేదా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమైనప్పుడు ఇది మరింత సాధ్యమవుతుంది, ఇక్కడ మన ప్రవర్తన గురించి అంతర్దృష్టిని పొందుతాము, తద్వారా మన ఆధ్యాత్మిక దినచర్యలో మరింత అవగాహన మరియు కచ్చితత్వంతో ఉంటాము. రేపటి సందేశంలో, మన ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు స్వీయ పరివర్తనకు సహాయపడే ఆధ్యాత్మిక సమూహంలోని నిర్దిష్ట అంశాలను అన్వేషిస్తాము.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »