Hin

21st sep 2024 soul sustenance telugu

September 21, 2024

సమూహాలలో ఆధ్యాత్మిక ఉన్నతిని అనుభూతి చెందడం (పార్ట్ 2)

ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక ఆంతరిక ప్రయాణం, ఈ ప్రయాణంలో మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి అవసరమైన విషయాలను నేర్చుకుని అభివృద్ధి చెందుతాము. ఇందులో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  మనం ఒంటరిగా ఆధ్యాత్మికతను అభ్యసిస్తే స్థిరత్వాన్ని కొనసాగించడం కష్టం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడంలో ఆధ్యాత్మిక సంఘాలు లేదా సమూహాలు ఎలా భారీ పాత్ర పోషిస్తాయో నిన్న మనం అర్థం చేసుకున్నాము. ఒక సమాజంలో భాగం కావడం మన భావోద్వేగ, మానసిక, సామాజిక మరియు శారీరక అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక కుటుంబం యొక్క సమావేశాలు మరియు సామూహిక ప్రకంపనలు మనల్ని నిరంతరం ప్రేరేపించడానికి సహాయపడతాయి. ఆధ్యాత్మిక సమాజంలో భాగం కావడం మన వ్యక్తిత్వాన్ని అనేక విధాలుగా రూపొందిస్తుంది. మనం ఇతర సభ్యులతో పరస్పరంలో చర్యలకు వచ్చినప్పుడు, కొన్ని విషయాలలో మన సామర్థ్యాన్ని పెంచుకోవడం నేర్చుకుంటాము –

  1. వివిధ వ్యక్తిత్వాల వ్యక్తులకు అనుగుణంగా మారండి.
  2. సహించండి, సర్దుబాటు చేసుకోండి.
  3. సహకరించండి కానీ పోటీ చేయవద్దు.
  4. వినండి, అర్థం చేసుకోండి మరియు సానుభూతి చూపండి.
  5. స్పష్టంగా, నిజాయితీగా సంభాషించండి.
  6. సవాలు విసిరే పరస్పర చర్యల యొక్క సమయంలో మానసికంగా స్థిరంగా ఉండండి.
  7. క్షమించండి మరియు నచ్చని ప్రకంపనలను పంచుకోవడం మర్చిపోండి.
  8. పరిస్థితులు మరియు వ్యక్తుల చర్యల యొక్క నిర్లిప్త పరిశీలకుడిగా మారండి.

 

  1. వ్యక్తులందరి ప్రత్యేకతలను గమనించండి (వారి బలహీనతలను అంచనా వేసే బదులు) మరియు ఉదారంగా ప్రశంసలు అందించండి.
  2. పరిస్థితులు మరియు వ్యక్తులను గుర్తించండి.
  3. పరస్పర చర్యల మధ్య కూడా అంతర్గత శాంతిలోకి వెళ్ళండి.
  4. ప్రతి ఒక్కరినీ గౌరవించండి మరియు ఆత్మగౌరవంతో ఉండండి.
  5. నిర్మాణాత్మక ప్రతిస్పందన ఇవ్వడానికి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.
  6. పరస్పర అనుభవాల నుండి నేర్చుకోండి.
  7. పంచుకోవడానికి, శ్రద్ధ వహించడానికి మరియు సహకరించడానికి స్వీయ-అవసరాలకు మించి వెళ్ళండి.

 

ఆధ్యాత్మికతను ఒంటరిగా అభ్యసించినప్పుడు, పైన పేర్కొన్న అన్ని అంశాలలో అభివృద్ధి  పరిమితం లేదా తక్కువగా ఉంటుంది, అయితే సమూహాలలో ఉండటం వలన వాటన్నింటినీ వ్యక్తీకరించడానికి మనకు ఎక్కువ అవకాశాలను ఇస్తుంది. పైన పేర్కొన్న లక్షణాలను ఒక సమూహంలో అభ్యసించడం ద్వారా, మనము వాటిని ఆత్మ లోపల మరింత బలోపేతం చేస్తాము. బోధించిన ప్రధాన విలువలు మరియు సూత్రాలు ఒక బలమైన పునాదిగా మారతాయి, దాని పైన మనం ఇతర పాత్రలు మరియు బాధ్యతలను నిర్మించవచ్చు. మనతో ఆధ్యాత్మికతను చేపట్టమని మన కుటుంబం, స్నేహితులు మరియు కార్యాలయ సహచరులను ప్రోత్సహించడం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించడం ఈ దిశలో ఒక సానుకూల అడుగు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »