Hin

16th nov 2023 soul sustenance telugu

November 16, 2023

సంకల్పబలంతో ఎటువంటి వ్యసనాన్నయినా అధిగమించండి

నా శరీరం దీనిని అడుగుతుంది అని కొందరు అంటారు. నిజానికి ఆ తృష్ణ మనసుదేగానీ శరీరానిది కాదు. టీ, కాఫీ,  మద్యం, మందులు లేదా ఇటువంటి ఏదైనా పదార్థాలు మనసుతో ముడిపడి ఉన్నాయి. కొన్నిసార్లు అనారోగ్యకర పదార్థాలకు మనం అలవాటుపడిపోతాము, ఆ తీవ్రమైన కోరికను దోహదం చేస్తూ – నేను వదలుకోలేను, నాకు అలవాటైపోయింది – అంటుంటాం.

ఏ పదార్థంపై మీరు ఆధారపడి ఉంటున్నారో గుర్తించండి. ఏ వ్యసనమైనా మన ఆలోచనా విధానంతోటే ముడిపడి ఉంటుంది, పదార్థంపై కాదు. దానిని పదేపదే తీసుకుంటూ దానిపై ఆధారపడేట్లుగా మనమే చేసుకున్నాము, ఈ అలవాటును మనం మార్చుకోవచ్చు.

మీ భావోద్వేగాల సృష్టికర్త మీరే. మీ మనసు యొక్క భావాలను సృష్టించడానికి మీకు ఎటువంటి పదార్థాల అవసరం లేదు. ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఇది లేకుండా నేనుండలేను అని ఎప్పుడూ అనకండి. ఇటువంటి ఆలోచనలు మీ సంకల్ప బలాన్ని క్షీణించేలా చేసి మీ వ్యసనాన్ని మరింత బలపరుస్తాయి.

మీ మనసు నుండి తీసేయాలంటే అలవాటైపోయింది అన్న మాటను మీ భాష నుండి తీసేయండి. ఉదయం టీ తీసుకోవడమే అనుకోండి, నేను ఉదయం టీ తీసుకున్నాను అనండి, అంతేకానీ టీ లేకుండా నేనుండలేను అందుకే తీసుకున్నాను అనకండి.

మీ శరీరం ఎటువంటి పదార్థంపై ఆధారపడి లేదు, మీ మనసే కోరికతో పెరపెరలాడుతుంది. రోజూ ఉదయం మెడిటేషన్ చేసి, అనారోగ్యకర అలవాట్లను దూరం చేసుకున్నట్లుగా విజువలైజ్ చేసుకోండి. మనసు శక్తివంతంగా, సంతోషంగా ఉన్నప్పుడు మనసును ఆనందపరచడానికి మీకు ఎటువంటి బాహ్య పదార్థము అవసరం లేదు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »