Hin

19th feb 2025 soul sustenance telugu

February 19, 2025

సన్నివేశాలను జాగ్రత్తగా రికార్డ్ చేయండి

మన ప్రతి ఆలోచన, మాట, ప్రవర్తన ఆత్మపై ముద్ర వేస్తుంది. అవి సి. డి. లో రికార్డింగ్లు లాగా ఉంటాయి. కాబట్టి ఆత్మలమైన మనం మన వ్యక్తిత్వంలో భాగమైన ఈ శాశ్వత రికార్డింగ్ల యొక్క సేకరణ. ప్రతి రికార్డింగ్ స్వచ్ఛంగా మరియు సానుకూలంగా ఉండాలి, ఎందుకంటే ఇది మన మనస్సు, శరీరం మరియు సంబంధాలను ఈ జీవితంలో మాత్రమే కాకుండా భవిష్యత్ జీవితంలో కూడా ప్రభావితం చేస్తుంది.

 

కూర్చొని ప్రతి సన్నివేశంలో ఆత్మపై అందమైన రికార్డింగ్లను మాత్రమే సృష్టించడానికి శ్రద్ధ వహించమని మీ మనస్సుకు నేర్పండి. ప్రతికూల భావాన్ని సృష్టించకుండా, ప్రతికూల సంఘటనలకు ప్రతిస్పందనగా ప్రతికూల అనుభవాన్ని రికార్డ్ చేయకుండా ఉండటానికి ప్రతిరోజూ ఈ ధృవీకరణను రిపీట్ చేయండి. స్వచ్ఛత, శాంతి మరియు ప్రేమ వంటి గుణాలు మీ వ్యక్తిత్వంలో పాతుకుపోతాయి. మీరు ఏమి ఆలోచిస్తున్నారో, మాట్లాడుతున్నారో మరియు చేస్తున్నారో అని మీరు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మీ ప్రతి కర్మ సరైనది అవుతుంది. ఇది ఆటోమేటిక్ గా పరిపూర్ణమైన విధిని సృష్టిస్తుంది.

 

ధృవీకరణ – 

 

నేను సంతోషకరమైన వ్యక్తిని. ఈరోజు…నేను అనేక పరిస్థితులను దాటుతాను…నేను చాలా అనుభవాలను సృష్టిస్తాను…వాటన్నింటినీ నేను ఆత్మపై శాశ్వతంగా రికార్డ్ చేసుకుంటాను. నేను జాగ్రత్తగా చూసుకుంటాను… పరిస్థితులు మరియు వ్యక్తులతో…నేను ఆలోచించేది, అనుభూతి చెందేది మరియు సంకర్షణ చెందేది… రికార్డ్ చేయబడుతోంది…ఈ రికార్డింగ్లో రీటేక్ ఉండదు… ఇది శాశ్వతమైనది… ఇది ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. నేను సరైన ఆలోచనలను మాత్రమే రికార్డ్ చేయడానికి ఎంచుకుంటాను. నేను ప్రతిస్పందించిన వ్యక్తుల కొన్ని అలవాట్లు…. ఎవరైనా అసభ్యంగా, విమర్శనాత్మకంగా, దురుసుగా, మోసపూరితంగా ఉంటే…. ఇప్పుడు నేను వారిని అర్థం చేసుకుంటాను. నేను వారి అలవాటును స్థిరత్వంతో ఎదుర్కొంటాను… వారు నన్ను అవమానించడం లేదని నేను రికార్డ్ చేస్తున్నాను… వారు వారి స్వభావానికి బాధితులు. నేను బాధపడను … నేను కరుణ యొక్క రికార్డింగ్ను చేసుకుంటాను… నొప్పి లేదా తిరస్కరణను కాదు. పరిస్థితి అనుకూలంగా లేకపోతే…అది ఎలా ఉందో అలానే నేను అంగీకరిస్తాను…నేను ప్రశ్నించను…నేను దానిని వ్యతిరేకించను. నేను ఏ సన్నివేశంలోనూ నెగిటివ్ రికార్డింగ్లు చేయను. నా స్వచ్ఛమైన మరియు సానుకూల రికార్డింగ్లు నా మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి… శరీరం ఆరోగ్యంగా ఉంటుంది… సంబంధాలు బలంగా ఉంటాయి… అవి నాకు ఆశీర్వాదాలను అందిస్తాయి.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »