Hin

13th june2024 soul sustenance telugu

June 13, 2024

సంతోషాన్ని సరిగ్గా జీవించడం (పార్ట్ 3)

సంతోషం అనేది బాహ్య ప్రభావాలపై ఆధారపడినది మానసిక స్థితి. ఉదా. మీరు ఒక గొప్ప వార్త వింటారు – మీ కార్యాలయంలో మీకు ప్రమోషన్ వచ్చింది. ఇది వినడానికి చాలా బాగుంటుంది, మీకు సంతోషాన్ని ఇస్తుంది. దానిలో తప్పు ఏమీ లేదు, కానీ మన సంతోషం అటువంటి సంఘటనలపై ఆధారపడటం ప్రారంభించినప్పుడు, మన సంతోషానికి పునాది తప్పు అవుతుంది. సానుకూల వార్త విన్న రోజు తర్వాత మీకు ఇష్టమైన స్పోర్ట్స్ టీమ్ చాలా ప్రసిద్ధమెయిన టోర్నమెంట్ ఫైనల్‌లో ఓడిపోయిందని మీకు చెప్పబడింది. మీ టీమ్ ఓడిపోవడాన్ని మీరు చూడగానే  అకస్మాత్తుగా మీ సంతోషం పోతుంది. కాబట్టి, సానుకూల సంఘటనలను ఆస్వాదించండి. కానీ మీ సంతోషం తప్పుడు పునాదిపై నిలబడినప్పుడు, దానిని తగ్గించే ప్రతికూల సంఘటనలు జీవితంలో ఉండవని అనుకోకండి.

కాబట్టి సంతోషంగా ఉండటానికి సరైన మార్గం ఏమిటి? జీవితం అందించే ప్రతిదాన్ని ఆస్వాదించండి – అన్ని మంచి విషయాలను ఆస్వాదించండి కానీ మీ సంతోషాన్ని వాటిపై ఆధారపడేలా చేయకండి. అలాగే, మీరు ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారం ఈ విధంగా నిజమైన ఆంతరిక సంతోషంతో ఉన్నట్లయితే, ఎప్పుడో ఒక సారి జరిగే ప్రతికూల సంఘటన లేదా రోడ్డుపై షాక్ లాంటి ప్రమాదం లేదా అకస్మాత్తుగా సంపద కోల్పోవడం కూడా మనల్ని కలవరపెట్టదు. శాంతి, ప్రేమ, జ్ఞానం మరియు శక్తి వంటి అంతరిక ఆధ్యాత్మిక సంపదను పెంచుకోవడంతో స్థిరమైన సంతోషం కలుగుతుంది కానీ బయటి సంఘటనల వలన కలగదు. దాని అర్థం బయటి సంఘటనలు మనల్ని సంతోషపెట్టవని కాదు. అవి సంతోషపెడతాయి, కానీ అవి జరిగినప్పుడు వాటి  హెచ్చు తగ్గులతో మనం నియంత్రించబడము. అలాగే, మన సంపదలను పెంచుకోవడం ద్వారా, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనం  సంతోషంగా ఉంటాము. అదే సంతోషాన్ని సరైన విధంగా ఆస్వాదించడం!

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th october 2024 soul sustenance telugu 1

ధనం  ఆశీర్వాదాలతో  సంపాదించడం

ధనం సంపాదించడం చాలా ముఖ్యం. ఆ ధనంతో మనం కొనుగోలు చేయగల అన్ని భౌతిక సౌకర్యాలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యం. కానీ ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక

Read More »
4th october 2024 soul sustenance telugu

సంబంధాలలో వ్యంగ్యానికి దూరంగా ఉండటం

భావోద్వేగపరంగా(ఎమోషనల్ గా) గాయపడినప్పుడు, స్వయాన్ని మెరుగ్గా చూపించడానికి ఇతరులను నిందిస్తాము. ప్రశంసలు, విమర్శలు లేదా కోపంలో ఉపయోగించినా, వ్యంగ్యం అనేది ప్రతికూల శక్తి. హాస్యభరితంగా, చమత్కారంగా అనిపించాలనే సాకుతో, మీరు వ్యంగ్యంగా ఉన్నారా? వ్యంగ్యం 

Read More »
3rd october 2024 soul sustenance telugu

ఈ నవరాత్రులలో మీ ఆంతరిక శక్తులను అనుభవం చేసుకోండి

నవరాత్రి (అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు) ఆచారాలు మన దివ్యత్వాన్ని ఎలా నిలుపుకుంటామనే దానిపై చాలా చెబుతాయి. నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక అర్ధాన్ని తెలుసుకొని మన ఆంతరిక శక్తులను అనుభవం చేసుకుందాము.

Read More »