Santhosham gurinchina 3 avaastava nammakaalu mariyu vaastavam

September 10, 2023

సంతోషం గురించిన 3 అవాస్తవ నమ్మకాలు మరియు వాస్తవం (పార్ట్ 2)

నిన్న మనం ఒక అవాస్తవ నమ్మకం గురించి చర్చించుకున్నాం. మనం సాధించే విజయాలే మనకు సంతోషాన్నిస్తాయి అని భావిస్తూ వచ్చాము. ఇది సరి కాదు. ఈరోజు మరో రెండు అవాస్తవ నమ్మకాల గురించి, వాటి అసలైన వాస్తవాల గురించి తెలుసుకుందాం.

అవాస్తవ నమ్మకం 2: నేను సంతోషాన్ని కొనగలను

ఉదాహరణకు, నేను కోరుకున్న కారును కొంటే నాకు సంతోషంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను అతి ఖరీదైన కారును కొన్నాను. నేను ఒక భౌతిక సదుపాయాన్ని కొనుగోలు చేసాను. ఇందులో సందేహం లేదు. ఆ కారులో లాంగ్ డ్రైవ్‌ చేస్తున్నప్పుడు, నా ఆనందాన్ని హరించే ఒక అప్రియమైన వార్తను తెలియజేసే ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా కారే నాకు ఆనందాన్ని ఇస్తుంది అన్న మాట నిజమైతే, ఫోన్ కాల్ తర్వాత కూడా నేను సంతోషంగా ఉండాలి కదా. కాల్ తర్వాత కూడా, నా కారు భౌతిక సౌకర్యాన్ని అందిస్తూనే ఉంది, నా భౌతిక శరీరం సౌకర్యంగానే ఉంది. సంతోషం అనేది భావోద్వేగ సౌలభ్యం కాబట్టి, నేను (ఆనందం కోసం వెతుకుతున్న నేను) కాల్ తర్వాత బాధలోకి వెళ్ళినప్పుడు సంతోషం అదృశ్యమైంది. కారు కొన్నప్పుడు మనం ఎందుకు సంతోషంగా ఉంటాము? ఎందుకంటే మనం ఒక ఆలోచనను సృష్టించినప్పుడు – నేను నా డ్రీమ్ కారును కొన్నాను, అది ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి, మనం ప్రతిస్పందన (సానుకూల ఆలోచన) సృష్టించడానికి ఒక వస్తువును (కారు) ఉద్దీపనగా ఉపయోగించాము.

వాస్తవము: మీకు ఆనందాన్ని ఇస్తాయి అని భావించి వస్తువులను కొనకండి. భౌతికమైన ప్రతీదీ భౌతిక సౌకర్యాన్ని ఇవ్వడానికే తయారయ్యాయి. సంతోషం అనేది భావోద్వేగ సౌకర్యం.

అవాస్తవ నమ్మకం 3: కుటుంబం, స్నేహితులు నాకు సంతోషాన్ని ఇస్తారు

అంగీకరించడం మరియు ఆశించడం మధ్యన జరిగే పెనుగులాటలో మన సంబంధాలు ఇరకాటంలో పడుతున్నాయి. బంధాలనుండి ఏమి పొందాలో ఆలోచిస్తున్నాంగానీ ఏమి ఇవ్వాలో ఆలోచించడం లేదు మనం. ఇతరులనుండి ఆశించడం ఎక్కువైపోయింది. ఇతరులు మన అవసరాలకు తగ్గట్లుగా మాట్లాడినప్పుడే, ప్రవర్తించినప్పుడే మనం వారిని అంగీకరిస్తున్నాం. ఇతరులు నన్ను అంగీకరిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అంటే, అటువంటి సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. ఇతరులు మొదటిసారి నేను చెప్పినట్లు వింటే, వెంటనే వారిపట్ల నాకున్న మరో ఆపేక్షను వినిపిస్తాను. అవతలి వ్యక్తి నేను చెప్పినట్లు వింటే సంతోషం నాలో నిలిచి ఉంటుంది లేదా విడిచి వెళ్ళిపోతుంది. తప్పొప్పుల గురించి ప్రతి ఒక్కరికీ వారివారి నిర్వచనాలు ఉన్నాయి. కాబట్టి నేను వారి నుండి ఆశిస్తున్నాను అంటే నా బంధాలను పాడు చేసుకోవడమే కాకుండా నా సంతోషాన్ని కూడా తగ్గించుకుంటున్నాను అని అర్థం.  

వాస్తవము: ఎవ్వరూ మనల్ని సంతోషపెట్టలేరు, బాధపెట్టలేరు. సంతోషం ఒక భావోద్వేగం, బంధాల నాణ్యతతో సంబంధం లేకుండా మనం సృష్టించుకున్న ఎమోషన్ ఇది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »